NTV Telugu Site icon

Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్

Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన బెంగుళూరులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చోటు చేసుకుంది. కోలారుకు చెందిన 19 ఏళ్ల లయస్మిత బెంగళూరు రూరల్‌ ప్రాంతంలో ఉన్న కాలేజీలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నది. ఆమెకు బెంగళూరులోని నృపతుంగ యూనివర్సిటీలో బీసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న పవన్ కల్యాణ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకుందామనుకుని పవన్ కల్యాణ్ లయస్మితకు ప్రపోజ్ చేశాడు. అప్పటికే లయస్మిత మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయం తనకు చెప్పింది.. పవన్‌ కల్యాణ్‌ ప్రేమను నిరాకరించింది.

Read Also : Villagers Attack : బీభత్సంగా కొట్టుకున్న రెండు వర్గాలు.. ఆపుదామకున్న పోలీసులకు గాయాలు

ఈ నేపథ్యంలో లయస్మితపై పవన్ కక్ష పెంచుకున్నాడు. కాగా, సోమవారం ఉదయం బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీ వద్ద ఉన్న లయస్మిత వద్దకు పవన్‌ కల్యాణ్‌ వచ్చాడు. తన వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆపై అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి రక్తం మడుగుల్లో పడి అక్కడే చనిపోయింది. గాయపడిన పవన్‌ కల్యాణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ప్రెసిడెన్సీ కాలేజీలో కలకలం రేపింది.

Show comments