Villagers Attack : బీభత్సంగా కొట్టుకున్న రెండు వర్గాలు.. ఆపుదామకున్న పోలీసులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Villagers Attack : మతమార్పిడి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణను ఆపేందుకు వెళ్లిన పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోని బస్తర్‌లో జరిగింది. బలవంతపు మతమార్పిడులను వ్యతిరేకిస్తూ ఒక చర్చిపై దాడికి స్థానికులు ప్రయత్నించారు. అడ్డుకునే యత్నంలో ఒక పోలీస్ అధికారి గాయపడ్డారు. నారాయణపూర్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా ఆదివాసీ వర్గం సోమవారం సమావేశమైంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య పెద్ద వాగ్వాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. తొలుత కుర్చీలు, రాళ్లు విసురుకున్నారు. అనంతరం కర్రలతో కొట్టుకున్నారు. చుట్టూ కుర్చీలు, రాళ్లు విసిరి కొట్టారు. కాసేపటికే అది పూర్తి స్థాయి పోరుగా మారింది.
Read Also: Russia-Ukraine War: రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. మిస్సైళ్లతో దాడి.. 400మంది మృతి
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఈ సందర్భంగా విశ్వ దీప్తి క్రిస్టియన్ స్కూల్ ప్రాంగణంలోని చర్చిపై దాడికి ఒక వర్గం ప్రయత్నించింది. మరోవైపు సమాచారం అందుకున్న నారాయణపూర్ ఎస్పీ సదానంద్, పోలీస్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. స్థానికులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి కర్రతో దాడి చేయడంతో ఆయన తలకు గాయమై రక్తం కారింది. దీంతో ఎస్పీ సదానంద్ కుమార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతానికి అదనపు పోలీసులను తరలించారు. నిరసనలు, ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులు మధ్యాహ్నం విశ్వ దీప్తి క్రిస్టియన్ స్కూల్ సమీపంలోకి వచ్చి పాఠశాల ఆవరణలో ఉన్న చర్చి వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తుండగా ఎవరో తన తలపై కర్రతో కొట్టారని ఎస్పీ సదానంద్ కుమార్ తెలిపారు.
Read Also: Power outage at Airport: ఎయిర్ పోర్టుకు పవర్ కట్.. నిలిచిన 282విమాన సర్వీసులు
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..