Crime News : ప్రేమను నిరాకరించిందని అమ్మాయిని కత్తితో పొడిచిన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News : బెంగుళూరులో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో అమ్మాయిని కత్తితో పొడిచాడు ఓ యువకుడు. అనంతరం అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన బెంగుళూరులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చోటు చేసుకుంది. కోలారుకు చెందిన 19 ఏళ్ల లయస్మిత బెంగళూరు రూరల్ ప్రాంతంలో ఉన్న కాలేజీలో మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నది. ఆమెకు బెంగళూరులోని నృపతుంగ యూనివర్సిటీలో బీసీఏ మొదటి సంవత్సరం చదువుతున్న పవన్ కల్యాణ్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో పరిచయాన్ని కాస్త ప్రేమగా మార్చుకుందామనుకుని పవన్ కల్యాణ్ లయస్మితకు ప్రపోజ్ చేశాడు. అప్పటికే లయస్మిత మరో వ్యక్తిని ప్రేమిస్తోంది. ఆ విషయం తనకు చెప్పింది.. పవన్ కల్యాణ్ ప్రేమను నిరాకరించింది.
Read Also : Villagers Attack : బీభత్సంగా కొట్టుకున్న రెండు వర్గాలు.. ఆపుదామకున్న పోలీసులకు గాయాలు
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఈ నేపథ్యంలో లయస్మితపై పవన్ కక్ష పెంచుకున్నాడు. కాగా, సోమవారం ఉదయం బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీ వద్ద ఉన్న లయస్మిత వద్దకు పవన్ కల్యాణ్ వచ్చాడు. తన వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచాడు. ఆపై అదే కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి రక్తం మడుగుల్లో పడి అక్కడే చనిపోయింది. గాయపడిన పవన్ కల్యాణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన ప్రెసిడెన్సీ కాలేజీలో కలకలం రేపింది.
A 19 year old girl Layasmitha died due to stab injuries at Presidency college, #Bengaluru. She was stabbed inside college by a boy named Pawan Kalyan. He also injured himself & in critical condition. The girl had allegedly not accepted his proposal #Karnataka pic.twitter.com/em2zitjAMJ
— Imran Khan (@KeypadGuerilla) January 2, 2023
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..