బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. చందాపుర హెడ్‌మాస్టర్ లేఔట్ నాలుగో అంతస్తులో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. అత్యంత కుళ్లిన స్థితితో ఉన్న యువతి నగ్న మృతదేహాన్ని సోమవారం సూర్యనగర పోలీసులు స్వాధీనం చేసుకుని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజుల కిందటే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి మరణించిన ఇంట్లో ఒడిశాకు చెందిన సపన్ కుమార్ (40) ఉండేవాడని పోలీసులు…