Benefits of Anjeer : ప్రతిరోజు అంజీర పండ్లు తినడంవల్ల కలిగే ప్రయోజనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంజీర పండ్లు మనలో చాలా మందికి తెలిసిన పండ్లే ఇవి. ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ రూపంలోకి మార్చిన అంజీర పండ్లు మార్కెట్‌లో మనకు లభ్యమవుతున్నాయి. వీటిని అందరూ చూసే ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్ రూపంలో దొరికే అంజీర పండ్లే కాదు సాధారణ పండు రూపంలోనూ అంజీర తింటే దానితో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ పండును రెండు పూటలా భోజనానికి ముందు తింటే దాంతో అనేక అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : Tech Tips : మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సేపు ఉండాలంటే ఇలా చేయండి
అంజీర పండ్లలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. గ్యాస్, యాసిడిటి, మలబద్దకం వంటి జీర్ణ సంబంధ సమస్యలన్నీ దూరం అవుతాయి. రక్తహీనత సమస్య నేడు చాలా మందిని బాధిస్తుంది. అలాంటి వారు నిత్యం రెండు అంజీర పండ్లను భోజనానికి ముందు తిన్నట్లయితే. వారిలో రక్తం బాగా వృద్ధి చెందుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఈ అంజీరలలో పోటాషియం, సోడియం బాగా లభిస్తాయి. ఇవి రక్తపోటు సమస్య నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. బీపీని కంట్రోల్‌లో ఉంచుతాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడి ప్లేట్‌లేట్స్ తగ్గిన వారికి పనులను తినిపిస్తే వెంటనే ప్లేట్‌లేట్స్ పెరుగుతాయి. అధిక బరువు సమస్య కూడా ఇప్పుడు అధికమైంది. ఈ క్రమంలో అంజీర పండ్లను రెండు పూటలా భోజనానికి ముందు తింటే దానితో పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల ఎక్కువగా ఆహారం తీసుకోవడం తగ్గుతుంది.
Also Read : Health Tips : రోజుకు ఒక్క ఉసిరికాయ చాలు.. మీ ఆరోగ్యం భద్రం..!
ఫలితంగా బరువు కూడా తగ్గుతారు. అంతే కాదు అంజీర్‌లో ఉండే పోషకాలు మన శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ని కూడా తగ్గిస్తాయి. అంజీర్ పండ్లలో మెగ్నిషియం, మాంగనీస్, జింక్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంతానం కావాలి అనుకునే వారికి మేలు చేస్తాయి. నిత్యం అంజీర్ పండ్లను తింటుంటే గుండె సంబంధ సమస్యలు కూడా రావు. అంజీర్ పండ్లలో ఉండే పెక్టిన్ అనే పదార్థం శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. క్యాన్సర్‌కి కారణమయ్యే పదార్థాలు నాశనం అవుతాయి. అంజీర్ పండ్లు మధుమేహం ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తాయి.
Also Read
భోజనానికి ముందు వీటిని తింటే అనంతరం రక్తంలో షుగర్ స్థాయిలు అంతగా పెరగవు. ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే ఆ అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. దగ్గు కూడా తగ్గుతుంది. అంజీర్ పండ్లలో కాల్షియం కూడా పుష్కలంగానే ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. ఎముకలు విరిగినవారికి వీటిని పెడితే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. జ్వరం, చెవి నొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలు ఉంటే అంజీర్ పండ్లు తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!