Modi Tour: ప్రధాని మోదీ పారిస్ పర్యటనకు ముందు ఫ్రాన్స్ భారత్‌కు భారీ ఆఫర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ ఒప్పందానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారత్‌తో కలిసి మల్టీ రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్‌ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు. ఇటీవల అమెరికాతో కుదిరిన GE-414 ఇంజిన్ డీల్ తరహాలోనే తాజాగా ఫ్రాన్స్ భారత్‌కు ఆఫర్ ఇచ్చింది. గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఫ్రెంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ సఫ్రాన్- భారత్‌కు చెందిన అడ్వాన్స్డ్ మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎసీఏ) సంయుక్తంగా పని చేయాడనికి మాక్రాన్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
Also Read
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
అయితే అధికారికంగా ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించలేదు. ఫ్రెంచ్ సఫ్రాన్ అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని 100శాతం భారత్‌కు బదిలీ చేసే విధంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాతో కూడా భారత్ ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. ఫ్రెంచ్‌తో చేసుకున్న తాజా ఒప్పందం ద్వారా ప్రతిపాదిత 110 కిలోల న్యూటన్ ఇంజిన్ పూర్తిగా స్వదేశంలోనే తయారవుతుందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. జెట్ ఇంజిన్ కాంట్రాక్ట్‌కు భారత్ భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. డిజైనింగ్ నుంచి ఇంజన్‌ను ధృవీకరించే వరకు మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సంతకం చేసిన తేదీ నుంచి 10 సంవత్సరాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా సఫ్రాన్ భారతదేశంలో తమ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది.
Read Also: Kichcha Sudeep: రాక్షసుడిగా మారిన కిచ్చా…
ఈ నెలలో ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ అతిథిగా హాజరుకానున్నారు. బాస్టిల్ డే పేరిట సందర్భంగా ప్రతి ఏటా జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం జరుపుకుంటారు. మే 5న, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేసింది. ఈ సందర్శన వ్యూహాత్మక సహకారం, ఆర్థిక సహకారం వంటి రంగాలలో వ్యూహాత్మక ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. తద్వారా భారతదేశం-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నారు.
Read Also: Annapurna Photo Studio: రౌడీ హీరో లాంచ్ చేసిన ట్రైలర్…
ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన కీలక మైలురాయిగా విదేశాంగ నిపుణులు అంటున్నారు. ఈ ఏడాదితో భారతదేశం- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవానికి చేరుకుంటుంది. భారతదేశం-ఫ్రాన్స్ మధ్య ఇప్పటివరకు 35 కంటే ఎక్కువ వ్యూహాత్మక భాగస్వామ్యాలపై సంతకం చేసింది. భారత్ మొదటిసారిగా 1998 జనవరిలో ఫ్రాన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం డీల్ చేసుకుంది. కొన్ని నెలల తర్వాత భారతదేశం పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించింది. ప్రపంచ అణు చట్రంలో భారతదేశానికి కీలకమైన స్థానాన్ని అందించడానికి స్వయంగా అప్పటి అధ్యక్షుడు చిరాక్ ప్రయత్నించారు.
తాజావార్తలు
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?