TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ వేదికగా తెలుగు ఫిలిం & టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFTDDA) ఉప ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. అయితే, టాలీవుడ్ పెద్దలు వద్దని వారించినా నిర్వహించిన ఈ ఎన్నికలు పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఉప ఎన్నికల ఫలితాలను కార్మిక శాఖ విశ్రాంత డిప్యూటీ కమిషనర్, లీగల్ అడ్వైజర్ వి. సామ్రాట్ అశోక్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ): G. బాలకృష్ణ (బాలు. G – కార్డ్ నెం. 426) 68 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆయన ప్రత్యర్థి B. శ్రీనివాస్ గౌడ్ (లడ్డు శ్రీను – కార్డ్ నెం. 77)కు 23 ఓట్లు మాత్రమే లభించాయి.
కోశాధికారి (ట్రెజరర్): P. ఇశ్రాయేలు (తడివేలు – కార్డ్ నెం. 212) 79 ఓట్లు సాధించి, 34 ఓట్లు పొందిన G. వీరస్వామిపై 45 ఓట్ల వ్యత్యాసంతో గెలుపొందారు.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
మహిళా కమిటీ సభ్యులు: K. నిరంజని (కార్డ్ నెం. 234 – 79 ఓట్లు), CH. సాయి లక్ష్మి (కార్డ్ నెం. 325 – 65 ఓట్లు) విజేతలుగా నిలిచారు. పోటీలో ఉన్న T. శ్రావణ సంధ్యకు 59 ఓట్లు వచ్చాయి.
ఏకగ్రీవంగా ఎన్నికైన వారు
ఉపాధ్యక్షుడు: G. శంకర్ (కార్డ్ నెం. 53)
జాయింట్ సెక్రటరీ: P. నాగ మల్లేశ్వర్ రావు (కార్డ్ నెం. 481)
ఆర్గనైజింగ్ సెక్రటరీ: G. రవితేజ (బన్ని – కార్డ్ నెం. 481)
ఈసీ కమిటీ సభ్యులు: P. కన్నయ్య (కార్డ్ నెం. 177), M. రమేష్ (చరణ్ – కార్డ్ నెం. 500), M. రాములు (కార్డ్ నెం. 531), B. వెంకన్న (కార్డ్ నెం. 415).
ఈ ఉప ఎన్నికల నిర్వహణ చుట్టూ తీవ్ర వివాదం నెలకొంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ ప్రతినిధులు ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలు నిర్వహించవద్దని సూచించినప్పటికీ, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా ముందుకు వెళ్లారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసోసియేషన్‌లో 600 మందికి పైగా సభ్యులుండగా, 502 మంది ఓటర్లుగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికలలో కేవలం 114 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు (వీటిలో 2 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి). శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ సహా మూడొంతుల మంది సభ్యులు ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఫెడరేషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడంపై అసోసియేషన్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రెసిడెంట్ సుమలత తీరుపై త్వరలోనే ఫెడరేషన్ కౌన్సిల్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి వ్యతిరేక వర్గం డాన్సర్లు సన్నాహాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!