అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాకు మంచి హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. పాటలు, టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
Read Also: Srikanth Addala: పెన్ను వదిలి కత్తి పట్టిన శ్రీకాంత్ అడ్డాల
అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయి. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నాటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారు. ఇక పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్‌ను ఇప్పుడే లాంచ్ చేశాను. రంగమ్మ అనే పాట రెట్రో ఫీలింగ్‌ను ఇచ్చింది. టీజర్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. జూలై 21న ఈ సినిమా థియేటర్లో వస్తోంది. అందరూ తప్పక చూడండి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. బిగ్ బెన్ స్టూడియోస్ నా కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్. బిగ్ బెన్ స్టూడియోస్ వల్లే పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయింది. యశ్ మామకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
Happy to launch the trailer of #AnnapurnaPhotoStudio https://t.co/lIhX8LfYuS
From the producer of #Pellichoopulu, played a big part in our dreams get a platform, is now backing another bunch of new talent, I wish this young talented team all success 🤗❤️@IamChaitanyarao… pic.twitter.com/4SmpUqPTg9
— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2023