ఈ మధ్య పులులు,సింహాలు, చిరుతల వంటి మ్యాన్ ఈటర్స్‌తో పాటు ప్రమాదకరమైన అడవి ఏనుగులు, ఎలుగుంబంట్లు జనావాసాల మీద పడుతున్నాయి. అడవులకు సమీపంలోని ప్రాంతాలలో ఇలా ఎక్కువగా జరుగుతోంది. వాటి స్తావరాలను మనుషులు చెదరగొడుతుండటంతో అవి ఊళ్లమీద పడుతున్నాయి. తాజా చత్తీస్‌గఢ్ లోని కంకేర్ నగరాన్ని ఎలుగుబండ్లు భయపెడుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఎలుగుబంట్ల కదలికలు పెరగటంతో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా రెండు ఎలుగుబంట్లు నగరంలోకి ప్రవేశించి ఓ ఆవుపై దాడికి ప్రయత్నించాయి.
ఇదిలా ఉంటే.. నగరంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఎలుగుబంట్లు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. కంకేర్ నగరంలో ఈ రోజు ఎలుగుబంట్లు నగర వీధుల్లో సంచరించాయి. నగర వీధుల్లో ఎలుగుబంట్లు ఉండటంతో ప్రజలు కంకేర్‌ను ఎలుగుబంటి అభయారణ్యంగా పిలుస్తున్నారు. రోజూ ఎలుగుబంట్లు సహా ఇతర జంతువులు భీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి..
कांकेर शहर में भालूओ का आतंक बढ़ता ही जा रहा है, आए दिन शहरी इलाकों में भालूओ के दिखने से दहशत का माहौल है ,रविवार को भी शहर में घुसे दो भालूओ का गाय से आमना सामना हो गया, फिर देखिए क्या हुआ..@gyanendrat1 @the_viralvideos @AnimalPlanet #kanker @wti_org_india pic.twitter.com/usjOhFZW5i
— Ashok Naidu (ABP News) (@Ashok_Naidu_) June 5, 2023