BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
- సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో ఘటన
- గుండు గీయించుకున్న మహిళకు రూ.15 వేలు
- విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్‌టాప్
- పురుషులకైతే రూ.6 వేలు ఇస్తారని మాయమాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BE ALERT: తమిళనాడులో విక్రమార్కుడు సినిమా తరహా గుండు సీన్ రిపీట్ అయింది. ఓ ఆకతాయి.. మహిళలకు ఫోన్ చేసి గుండు చేయించుకుంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఆశ చూపించాడు. తీరా సీన్ కట్ చేస్తే.. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో గుండు చేసుకున్న మహిళలు కంగుతిన్నారు. అసలు ఇంతకు ఈ మోసం ఎక్కడ జరిగింది? మహిళలు ఏం చెబుతున్నారు? చూశారా..!! లచ్చిందేవి..లచ్చిందేవి.. అంటూ మాయమాటలతో బురిడీ కొట్టించి.. మహిళలందరికీ అరగుండు కొట్టించాడు హీరో రవితేజ. గుండు సగంలో ఆపేసి హీరో వెళ్లిపోతే.. ఆ తర్వాత ఆ మిగిలిన అరగుండు గీసేందుకు బ్రహ్మానందం వచ్చి.. మహిళల వద్ద భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. ఇదిగో ఇలా..!!
ఈ సినిమాలో తరహాలోనే సేమ్ టు సేమ్ ఇన్సిడెంట్.. తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో జరిగింది. పుదుకొత్తంబాడికి చెందిన పళనియమ్మాళ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను తాలూకా కార్యాలయ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆ ప్రాంతంలోని మహిళలకు కరోనా లాంటి కొత్తరకం వ్యాధి వ్యాపిస్తోందని భయపెట్టాడు. విదేశాల్లో ఆ వ్యాధి బారినపడిన మహిళలంతా గుండు గీయించుకుని ప్రాణాలు కాపాడుకున్నారని మాయ మాటలు చెప్పాడు. కాబట్టి.. పుదుకొత్తంబాడిలో మహిళల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నాడు.
Also Read
- Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
- Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం... సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
- Karnataka: దారుణం.. భార్యను ఉరితీసి, చివరి క్షణాలను తల్లిదండ్రులకు చూపించిన భర్త..
- Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
అంతటితో ఆగని.. ఆ వ్యక్తి.. అలా గుండు గీయించుకున్న మహిళలు ఒక్కొక్కరికి రూ.15 వేలు, పాఠశాల, కాలేజీ విద్యార్థినులకు రూ.45 వేలు, ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకైతే రూ.6వేలు చెల్లించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపాడు. ఐతే ఇప్పటి వరకు కేవలం 18 మందికి మాత్రమే టోకెన్లు వచ్చాయని.. రికార్డుల్లో పళనియమ్మాళ్ పేరు ముందున్నందున ఆమెకు ఫోన్ చేసినట్లు చెప్పాడు. అంతే కాకుండా తన మాటలపై అనుమానం రాకుండా ఉండేందుకు.. గుండు చేయించుకున్న మహిళల నకిలీ ఫొటోలతో పాటు రూ.500 నోట్ల కట్టల చిత్రాలను పళనియమ్మాళ్‌కు వాట్సాప్ చేశాడు. ఆ ఫొటోలను చూసి అది నిజమైన ప్రభుత్వ పథకమేనని ఆమె గుడ్డిగా నమ్మేసింది…..
పళనియమ్మాళ్ కాస్తా విషయాన్ని చుట్టుపక్కల మహిళలందరికీ చెప్పడంతో.. అంతా బార్బర్‌ను పిలిచి గుండు గీయించుకున్నారు. ఇందులో భాగంగా గుండు చేయించుకున్న కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు.. ప్రభుత్వం ప్రకటించిన డబ్బుల కోసం ఆ వ్యక్తి నంబర్‌కు కాల్ చేశారు. అతని మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో మహిళల మైండ్ బ్లాంక్ అయింది. నేరుగా అత్తూరు తాలూకా కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. అసలు అలాంటి ప్రభుత్వ పథకం ఏదీ లేదని అధికారులు స్పష్టం చేయడంతో తీవ్రంగా మోసపోయామని గ్రహించారు. ఈ ఘటనపై వెంటనే ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘరానా మోసంతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు…స్పాట్..
- Tags
- Be Alert
- NTV Telugu
- Tamil Nadu
తాజావార్తలు
-
Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
-
Student Suicides: మార్కులు తక్కువ వచ్చాయనే మనస్తాపం.. రెండు కుటుంబాల్లో కన్నీటి విషాదం
-
BE ALERT: గుండు గీకిన బంటు..తమిళనాడులో విక్రమార్కుడు సీన్..
-
Humanoid Robot: రూ.3,000 ఇస్తే చాలు… మీ ఇంట్లోని చెత్తంతా ఎత్తి పడేస్తుంది..
-
Love Fail: లవర్ హ్యాండ్ ఇచ్చాడని మనస్తాపం… సీపీఆర్ చేసినా దక్కని యువతి ప్రాణాలు..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!