ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలను వెలుగులోకి వచ్చిన అనేక ఘటనలు చుశాం. అయితే తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో మరో స్కాం బయట పడింది. అది ఏంటంటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ క్లోన్ ఫ్రాడ్. దీనితో మోసగాళ్లు ఏకంగా మనకి సంబంధిచిన స్నేహితులు, బంధువులు లేదా తల్లిదండ్రులు వాయిస్ లని క్లోనింగ్ చేసి ఫేక్ కాల్స్ తో కొత్త దందాకి తెరలేపారు. సాయం కోసం మీద డబ్బులు అడుగుతున్నారు. వాటి గురించి తెలుసుకునేలోపే సదురు వ్యక్తులు పూర్తిగా మోసపోతున్నారు. కాబట్టి ఈ అంశంపై అప్రమత్తంగా లేకుంటే మాత్రం ప్రమాదంలో పడే అవకాశం ఉందని టెక్ నిపుణులు హెచ్చరికాలు జారీ చేస్తున్నారు.
Read Also: Fake Cancer Drug Racket: ఢిల్లీలో ఫేక్ క్యాన్సర్ మెడిసిన్ రాకెట్ గుట్టు రట్టు
ఇకపోతే తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఢిల్లీ దగ్గర్లోని ఎన్‌సీఆర్ లో చితి చేసుకుంది. కావేరి అనే మహిళ ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా విషయాన్ని వెల్లడించారు. తనకు ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి తాను పోలీస్ అధికారినని అంటూ ఫోన్ వచ్చిందని తెలిపారు. ఇక మరో ఘటనలో ఢిల్లీకే చెందిన ఓ మహిళకు కూడా కెనడా నుంచి తన సోదరుడి కొడుకు నుంచి కాల్ వచ్చిందని.. అక్కడ తన కారు ప్రమాదానికి గురైందని తన ఆమెకు తెలిపాడు. ఇందులో భాగంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని., కాబట్టి బెయిల్ కోసం తనకి డబ్బులు కావాలని కోరాడు. దాంతో ఆ మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాల్ ని కాస్త తన సోదరుడి కుమారుడి వాయిస్ గా తప్పుగా అనుకోని వారికి డబ్బును బదిలీ చేసింది. ఆ తర్వాత ఆమె తన సోదరుడి కుమారుడికి కాల్ చేయగా., తాను సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయానని తెలుసుకుని పోలీసులకు తెలిపింది. ఇలాంటి స్కామ్స్ చేయడానికి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్ వేర్ లను ఉపయోగిస్తున్నట్లు అర్ధమవుతోంది. కాబట్టి ఇలాంటి కాల్స్ ను గుర్తించి జాగ్రత్తగా ఉండండి.