NTV Telugu Site icon

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫి భారత జట్టు ఇదే.. తెలుగు తేజం నితీశ్‌కు నిరాశ

Team

Team

హైబ్రిడ్ మోడల్‌లో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రకటించింది. టీమ్ ఇండియా కెప్టెన్‌ పగ్గాలను రోహిత్ శర్మకే అప్పగిస్తూ.. బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ ముఖ్యమైన టోర్నమెంట్‌కు యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. పవర్ ఫుల్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తిరిగి అరగేట్రం చేశాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న.. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొంత ఉపశమనం లభించడంతో టీంలోకి ప్రవేశించాడు. ఈ ట్రోఫిలో తెలుగు తేజం నితీశ్‌కుమార్‌ రెడ్డికి మాత్రం నిరాశే మిగిలింది.

READ MORE: Kolkata Doctor Case: ‘‘నేను నేరం చేయలేదు, నన్ను ఇరికిస్తున్నారు’’.. కోర్టు నిందితుడి వాదన..

కాగా.. ఈ ట్రోఫికి సంబంధించి పాకిస్థాన్ మినహా అన్ని టీమ్‌లు తమ తమ జట్లను ప్రకటించాయి. మరికొద్ది రోజుల్లో పాకిస్థాన్ తన జట్టును కూడా ప్రకటించనుంది. ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే భారత్ తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. ఫిబ్రవరి 20న భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. తమ ఆటగాళ్లను పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. భారత్ రెండో సెమీఫైనల్‌కు చేరుకుంటే వేదికను లాహోర్‌ నుంచి దుబాయ్‌కి మార్చనున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ టోర్నమెంట్ కోసం ఐసీసీ హైబ్రిడ్ మోడల్ విధానాన్ని అనుసరించాల్సి వచ్చింది.

READ MORE: RG Kar Case Verdict: కోల్‌కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..

15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, జడేజా, గిల్