నంద్యాల జిల్లా రాజకీయాల్లో ఆ నాయకుడి రూటే సెపరేట్.. ఆయన ఒక్కసారి మాట ఇచ్చారంటే అంతే.. సొంతంగా ఎంత ఖర్చైనా పర్లేదు.. ప్రజల కోసం ఎన్ని కోట్లు ఖర్చు అయినా చేసి తీరాల్సిందే అని పంతం పడతారు.
2024లో జరిగే ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు మరో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్న వేళ నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి దూకుడు పెంచారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు అమాంతం పెంచి సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ పేద ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు. గురువారం కోవెలకుంట్ల మండలం లోని కలుగొట్ల గ్రామంలో ఆయన పర్యటించి విద్యుత్ సమస్య కరెంట్ ఛార్జీల పెరుగుదలతో ప్రజలను ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని చెబుతూ విద్యుత్ బిల్లులు పెంచి సంక్షేమ పథకాల్లో…