Devil : ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ రామ్ ‘డెవిల్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఇటీవల బింబిసార సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అమిగోస్ మూవీ ఫ్లాప్ కావడం తో కళ్యాణ్ రామ్ తరువాత మూవీ అయిన డెవిల్ పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. డెవిల్ మూవీ గత ఏడాది డిసెంబర్ 29 న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ గా కనిపించారు. డెవిల్ లో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్తమీనన్ నటించింది. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో అలరించడానికి రెడీ అయ్యింది.
డెవిల్ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు డెవిల్ ఓటీటీ డీల్ సెట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది.డెవిల్ మూవీ ను సంక్రాంతి కానుక గా జనవరి 14 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సడన్ గా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. ఈ సంక్రాంతి కి థియేటర్స్ లో కొత్త సినిమాల సందడి మొదలైంది.మహేష్ బాబు గుంటూరు కారం, తేజ హనుమాన్ మరియు వెంకటేష్ సైందవ్ ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. అలాగే నాగార్జున ‘నా సామిరంగ’ రేపు రిలీజ్ కానుంది..దీనితో ఓటీటీ ప్రేక్షకులకు కూడా డెవిల్ మూవీ తో మేకర్స్ సంక్రాంతి ట్రీట్ ఇవ్వనున్నారు.అయితే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని డెవిల్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అయినా మెప్పిస్తుందో లేదో చూడాలి..
Also Read
- Tags
- Devil
- Kalyan Ram
- OTT
- release
తాజావార్తలు
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!