ఎవరైనా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే తాను మౌనంగా ఉండబోనని, కర్ణాటకలో గణపతి ఉత్సవాలను ఆపాలని ప్రయత్నిస్తున్న వారిని కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. సనాతన ధర్మం తన నరనరాల్లో ప్రవహిస్తుందని అని అన్నారు. హవేరీ జిల్లాలోని బంకాపూర్‌లో శనివారం జరిగిన హిందూ జాగృతి సమ్మేళన్‌లో బొమ్మై ప్రసంగిస్తూ.. గణపతి పండుగను ఆపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.