Extramarital Affair: ట్యాక్సీ డ్రైవర్‌తో బ్యాంక్ మేనేజర్ భార్య ఎఫైర్.. భర్తను చంపేందుకు ప్లాన్! క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: ఒకవైపు అందమైన కుటుంబం, మంచి ఉద్యోగం చేసే భర్త, ఇద్దరు పిల్లలు.. బయటికి ఎంతో సంతోషంగా కనిపిస్తున్న ఆ కుటుంబంలో ఒక ట్యాక్సీ డ్రైవర్ రాకతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ప్రియుడి కోసం భర్తను హతమార్చడానికి కూడా వెనుకాడని ఒక భార్య ఉదంతం ఇప్పుడు రాజస్థాన్‌లో చర్చనీయాంశమైంది. అసలు ఏమైందంటే.. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన అర్చన అరోరాకు 2018లో జైపూర్‌లో ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న అర్ణవ్ ఖత్రీతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఉద్యోగ రీత్యా జైపూర్‌లో ఉండగా, అర్చన అల్వార్‌లో ఉండేది. అల్వార్ నుంచి జైపూర్‌కు వెళ్లే క్రమంలో ఆమెకు రిషబ్ శర్మ అనే ట్యాక్సీ డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
READ ALSO: SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!
Also Read
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అంగప్రదక్షిణ సేవ ఈ-డిప్ రిజిస్ట్రేషన్‌కు తేదీ ఖరారు.!
వీరిద్దరి సంబంధం ఎంత ముదిరిందంటే, ఏకంగా ఆ వివాహిత తన భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లింది. ఒకరోజు అర్ణవ్ తన భార్య ప్రియుడి ట్యాక్సీలో జైపూర్ నుంచి అల్వార్ వస్తుండగా వెనుక సీట్లో నిద్రపోయాడు. అర్ణవ్ నిద్రపోతున్నాడని అనుకున్న డ్రైవర్ రిషబ్ వెంటనే తన ప్రియురాలు అయిన అర్చనకు ఫోన్ చేసి.. “నువ్వు ఓకే అంటే.. ఇప్పుడే నీ భర్త పని ముగించేస్తాను (చంపేస్తాను)” అని చెప్పాడు. అయితే అదృష్టవశాత్తూ అర్ణవ్ అప్పటికే నిద్రలేచి ఉన్నాడు. ఆ మాటలు విన్న అతను ఏమాత్రం కంగారు పడకుండా, వారి మాటలను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఆ ఒక్క రికార్డింగ్ వారి అసలు రంగును బయటపెట్టింది.
తన భార్య కుట్రను తెలుసుకున్న అర్ణవ్ ఆమెను నిలదీశాడు. దీంతో గొడవలు మొదలై చివరకు అవి విడాకుల వరకు వెళ్లాయి. అయితే విడాకులు ఇచ్చి విడిపోవాలంటే తనకు రూ.50 లక్షలు ఇవ్వాలని అర్చన డిమాండ్ చేసింది. దానికి ఆమె భర్త నిరాకరించడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడు రిషబ్‌తో కలిసి పరారైంది. 2026 మార్చిలో భర్త అర్ణవ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. భార్యను ఆమె ప్రియుడిని పోలీసులు గాలిస్తుండగానే, తప్పించుకోవడం సాధ్యం కాదని భావించిన అర్చన – రిషబ్ స్వయంగా అల్వార్ ఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు. ప్రస్తుతం పోలీసులు అర్చనను జైలుకు పంపగా, ఆమె ప్రియుడు రిషబ్‌ను విచారిస్తున్నారు. కళ్లముందు కనిపిస్తున్న అందమైన జీవితాన్ని కాలదన్ని, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ మహిళ జీవితాన్ని కటకటాల పాలు చేసింది.
READ ALSO: RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్‌వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!
తాజావార్తలు
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి