RGV: “దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను”.. అండర్‌వరల్డ్ గురించి వర్మ పచ్చి నిజాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV: 1990వ దశకంలో బాలీవుడ్‌ను అండర్‌వరల్డ్ ఏ విధంగా శాసించిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో తెర వెనుక గ్యాంగ్‌స్టర్ల నీడలో చిత్ర పరిశ్రమ నడిచేదని, నిర్మాతలు, దర్శకులు బెదిరింపులకు గురయ్యేవారని ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మాత్రం ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచే నిజాలను వెల్లడించారు. తన ఆత్మకథ ‘గన్స్ అండ్ థైస్’ (Guns and Thighs) ప్రస్తావనలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
READ ALSO: Asim Munir: ఇరాన్‌కు “యుద్ధ వేషం”, అమెరికాకు “సూట్”.. అసిమ్ మునీర్ డ్రెస్సింగ్ వెనక వ్యూహం..
Also Read
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
దావూద్‌కు పుస్తకాన్ని అంకితం ఇవ్వాలనుకున్నా..
తన ఆత్మకథను అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అంకితం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వర్మ వెల్లడించారు. “నేను ఆ పుస్తకాన్ని దావూద్‌కే అంకితం చేశాను, కానీ ప్రచురణకర్తలు భయపడి ఆయన పేరును తొలగించారు. ఒకవేళ దావూద్ ఇబ్రహీం లేకపోతే, నేను ‘సత్య’, ‘కంపెనీ’ వంటి ఐకానిక్ చిత్రాలను తీయగలిగే వాడిని కాదు. ఆయన వల్లే నేను బతుకుతున్నాను, అలాంటప్పుడు ఆయనకు ఎందుకు అంకితం ఇవ్వకూడదు?” అని ఆర్జీవీ ప్రశ్నించారు.
నాకు బెదిరింపులు రాలేదు..
బాలీవుడ్ ప్రముఖులు గ్యాంగ్‌స్టర్ల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని భయపడేవారని, కానీ తనకు మాత్రం అలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదని వర్మ పేర్కొన్నారు. “నాకు ఎప్పుడూ బెదిరింపులు రాలేదు. ఎందుకంటే అండర్‌వరల్డ్ వాళ్లకు నేను తీసిన ‘సత్య’, ‘కంపెనీ’ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలు చూసి వారు నన్ను తమ ఆత్మబంధువులా భావించారు. అందుకే వాళ్లు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు” అని ఆయన వివరించారు. అప్పట్లో గ్యాంగ్‌స్టర్ల జీవితాలపై తీసిన చిత్రాలకు స్వయంగా ఆ గ్యాంగ్‌స్టర్లే నిధులు సమకూర్చారని వర్మ సంచలన వాస్తవాన్ని బయటపెట్టారు. ‘సత్య’, ‘కంపెనీ’తో పాటు ‘షూటౌట్ ఎట్ వాడాలా’, ‘షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా’ వంటి చిత్రాలకు అండర్‌వరల్డ్ నుంచే పెట్టుబడులు వచ్చాయని ఆయన చెప్పారు. గతంలో వచ్చిన ‘దీవార్’, ‘ముకద్దర్ కా సికిందర్’ వంటి క్లాసిక్ సినిమాలకు కూడా ఇలాంటి మద్దతే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అండర్‌వరల్డ్ అంటే కేవలం భయానికి మాత్రమే గుర్తు కాదని, తనకు క్రియేటివ్ ఇన్స్పిరేషన్ అని ఆర్జీవీ చెప్పారు.
READ ALSO: SS Rajamouli: ప్రపంచ సినిమాను ఏలబోతున్న ‘వారణాసి’.. ఇండియన్ సినిమా దిశను మార్చబోతున్న జక్కన్న!
తాజావార్తలు
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!