Bandi Sanjay: ఓవైసి, కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లింలకు ఏం చేసింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: ఓవైసి, కేసీఆర్ అన్న దమ్ములు.. ఎంఐఎం పార్టీ ముస్లిం వారికి ఏం చేసింది? అని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఓవైసి పోటు గాడు చార్మినార్ కే పరిమితమన్నారు. దమ్ముంటే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. అధికార పార్టీ దగ్గర ఎంఐఎం డబ్బులు తీసుకోవడం అలవాటు అని అన్నారు. తెలంగాణలో బీజేపీ రాష్ట్రంలో అధికారం రావడానికి ఇతర రాష్ట్రాల నుండి ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటిస్తున్నారని అన్నారు. బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు చూస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలపై బీజేపీ పోరాటం చేసిందని అన్నారు. బెంగాల్ లాగా బీఅర్ఎస్ పార్టీ వ్యవహరిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ సగం మందికి టికెట్స్ రావని కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఇచ్చారని ఎద్దేవ చేశారు. 30 శాతం కమిషన్ అంటే కేసీఆర్ కుటుంబం, అవినీతి కుటుంబం అని బండి తెలిపారు. మళ్ళీ ఎన్నికలు రాగానే అమలు కాని హామీలు ఇస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ఎలా కోటీశ్వరులు అయ్యారు? ఏం బిజినెస్ చేశారు? అంటూ ప్రశ్నించారు.
Read also: Traffic Alert: మంచిరేవులో కేసీఆర్ కోటి మొక్కలు నాటే కార్యక్రమం.. నార్సింగ్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
- 4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
వైన్స్ షాప్ దంధాలు చేయడానికి, కేసీఆర్ కుటుంబం, అధికారులు ప్లీజ్ టెండర్ వేయండి అంటూ మార్కెటింగ్ చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్ 3 సక్సస్ అయింది..అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అక్కడ ఎలాంటి దందా చేయవచ్చు, అని ఆలోచన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దందా నెక్స్ట్ చంద్ర మండలం పై చేస్తారని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తుండు కేసీఆర్ అని మండిపడ్డారు. గవర్నర్ కి భయపడే సీఎం సయోధ్యకి వచ్చాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిల్లులు ఆమోదం కోసమే గవర్నర్ తో సీఎం సయోధ్యకు వచ్చారని బండి ఆరోపించారు. నేను సీఎం కావాలని అనుకోవటం లేదు, అనుకునే వాళ్ళు మూర్ఖులు అని అన్నారు. ముందు రాక్షన ప్రభుత్వంను తొక్కాలని అన్నారు. బండి సంజయ్ ఎక్కడి నుండి పోటీ చేసేది అనేది అధిష్టానం చూసుకుంటుంది అని అన్నారు. సర్వేలు ఆధారంగా టికెట్ ఇస్తారు.. బీజేపీలో లాబియింగ్ ఉండదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారని బండి సంజయ్ తెలిపారు.
Hyderabad: భోలక్ పూర్ లో వింత ఘటన.. విషం పెట్టి పిల్లులను చంపారని ఫిర్యాదు
తాజావార్తలు
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!