Traffic Alert:హైదరాబాద్ నగరంలోని నార్సింగ్ ప్రాంతంలో ఈరోజు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సీఎం పర్యటన నేపథ్యంలో టీఎస్ పీఏ నుంచి మంచిరేవుల మీదుగా నార్సింగి వరకు ఓఆర్ ఆర్ సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్నట్లు సైబరాబాద్ జాయింట్ సీపీ(ట్రాఫిక్) నారాయణనాయక్ తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మళ్లింపు అమల్లో ఉంటుందని వెల్లడించారు. గండిపేట మండలం మంచిరేవులో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్కును ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇదే సందర్భంగా పార్కును కూడా సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అంతే కాకుండా తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే సీఎం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇవాళ మంచిరేవులో సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. భవిష్యత్ తరాలకు మంచి జీవితాన్ని అందించేందుకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.
Read also: Musheerabad PS: సార్ నా మేకపిల్లను కిడ్నాప్ చేశారు.. ప్లీజ్ వెతికి పెట్టండి
మంచిరేవులో వందల ఎకరాల అటవీ భూమి నిర్మాణ వ్యర్థాలతో డంపింగ్ యార్డుగా మారడంతో పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. నేడు, అదే ప్రాంతం ఫారెస్ట్రెక్ పార్క్‌గా రూపాంతరం చెందింది, ఇది ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని ఇస్తుంది. 256 ఎకరాల భూమిని అటవీ శాఖ మరియు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (TSFDC) సంయుక్తంగా ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌గా అభివృద్ధి చేశారు. పార్కులో డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, టాయిలెట్ బ్లాక్, వాచ్ టవర్, గ్రామ దేవత దేవాలయం, ఓపెన్ జిమ్నాసియం, యాంఫీ థియేటర్, జలపాతం, బ్యాలెన్సింగ్ స్టోన్స్, పిల్ల ఏనుగు, డేగ ముఖం, రచ్చా బ్యాండ్‌లు, కూర్చునే బెంచీలు ఏర్పాటు చేశారు. ఫారెస్ట్రెక్ పార్క్ నెలకు దాదాపు రూ.3 లక్షల ఆదాయం సమకూరుస్తుంది. ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో 11 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రతిరోజూ వందలాది మంది సందర్శకులు పార్కుకు తరలి వస్తారు. ట్రెక్కింగ్ సౌకర్యంతో ప్రతి ఆదివారం 2,000 మంది వరకు సందర్శిస్తారు. పర్యాటకులను ఆకర్షించేందుకు చిన్న కొండలను కూడా నిర్మించారు.
Hyderabad: భోలక్ పూర్ లో వింత ఘటన.. విషం పెట్టి పిల్లులను చంపారని ఫిర్యాదు