Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే నిర్మాతగా మారి మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనే కోరికతో ఉన్నాడు. దానికోసం ఎదురుచూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు.. బండ్ల గణేష్ అంటే ఎంతో ప్రేమనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమాని అనడం కన్నా ఆయనను భక్తుడు అని చెప్పుకోవచ్చు. దేవరా అనే పదాన్ని పరిచయం చేసింది బండ్ల గణేష్ అనే చెప్పాలి. పవన్ సినిమా ఈవెంట్స్ లో గణేష్ స్పీచ్ ల్లో ఈ పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆ తరువాత ఆ పదం భీమ్లా నాయక్ సినిమాలో కొక్కిలి దేవర అని త్రివిక్రమ్ చూపించాడు. ఇక ఇప్పుడు దేవర అనే పదాన్నే ఎన్టీఆర్ 30 కి టైటిల్ గా పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నేటి సాయంత్రం 7 గంటలకు మేకర్స్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
Ayushmann Khurrana: స్టార్ హీరో ఇంట తీవ్ర విషాదం
ఇక ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. అంతా బావుంది. దేవర టైటిల్ తో అభిమానులు ఫ్లెక్స్లీ లు కూడా రెడీ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవర టైటిల్ నాది అంటూ బండ్ల గణేష్ బాంబ్ పేల్చాడు. దేవర టైటిల్ ను తన దగ్గర నుంచి కొట్టేశారని బండ్లన్న ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యాడు. “దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్.. నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు” అంటూ కోపంతో కూడిన ఎమోజిని షేర్ చేసాడు. మొదటి నుంచి దేవర టైటిల్ పవన్ కోసమే అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. బ్రో సినిమాకు ముందు దేవర టైటిల్ ను పెడితే బావుంటుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ, ఆ సినిమా క్లాస్ లుక్ తో ఉండడటంతో దేవర సెట్ కాదని, ఎన్టీఆర్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ లో కనిపిస్తాడు కాబట్టి ఈ సినిమాకు దేవర టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇంతలోనే బండ్ల ఈ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో చూడాలి.
దేవర నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న నా టైటిల్ నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు 😡 https://t.co/Y4guc8Yl34
— BANDLA GANESH. (@ganeshbandla) May 19, 2023