చొప్పదండి బీజేపీ ప్రచారంలో బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉప ఎన్నికలు వస్తాయని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని పోటీపడుతూ కవిత కూడా ముఖ్యమంత్రి కావాలని పోటీపడుతూ తర్వాత హరీష్ రావు సంతోష్ కుమార్ వీళ్ళందరూ సీఎం పదవికి పోటీలో ఉంటారు.. కాంగ్రెస్ లో కూడా అంతే ఎవరు ముఖ్యమంత్రి ఇప్పటికి తెలియని పరిస్థితిలో ఉన్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యనించారు.
Read Also: PM MODI: తొలి సారి తెలంగాణలో.. ప్రధాని మోడీ రోడ్ షో..
చొప్పదండిలో బీజేపీ పార్టీ భొడిగే శోభను గెలిపించకపోతే మీరు ఓవైసీ తమ్ముళ్లయితారని బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెలిపించకపోతే కేసీఆర్ కు అల్లుల్లు అవుతారని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఎవరికో పుట్టిన బిడ్డను నా బిడ్డను చెప్పుకుంటాడు కేసీఆర్.. ధరణి తప్పుల తడకని నువ్వే చెప్పుకున్నవ్ కదా.. కేసీఆర్ ఇదిగో నీ అఫిడవిట్.. నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది.. మరి ఇప్పుడేమంటావ్.. నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా? అని ఆయన ప్రశ్నించారు.
Read Also: Uniform Civil Code: ఉత్తరాఖండ్‌లో వచ్చే వారం నుంచి యూసీసీ బిల్లు అమలు
ధరణి పోర్టల్ రైతులను అరిగోస పెడుతుందని అంగీకరిస్తవా? అని బండి సంజయ్ అన్నారు. నేనైతే సీఎం అవుతానని చెప్పను.. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు పార్టీ అధిష్టానమే సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తుంది.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం కావడం తథ్యం.. హైకమాండ్ ఇదే విషయాన్ని ప్రకటించింది.. కాంగ్రెస్ కు ప్రజల్లో ఇమేజ్ లేనేలేదు అని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ను ఓడగొట్టేది బీజేపీయే.. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం.. కాంగ్రెస్ ను గ్రాఫ్ ను పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సంచులు పంపుతున్న కేసీఆర్.. కాసులకు అమ్ముడుపోయే కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ ను తరిమికొట్టండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.