PM MODI: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. ఈనేపథ్యంలో నవంబర్ 11వ తేదీతో పాటు ఈనెలలోనే మోడీ మూడు రోజుల పాటు తెలంగాణలో ఎన్నిక ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణ కు ప్రధాని మోడీ రానున్నారు. తెలంగాణలో ఆ.. మూడురోజుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని. 25న కరీంనగర్ జన గర్జన సభ, 26న నిర్మల్ జన గర్జన సభ, 27న హైదరాబాద్ లో మోడీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ తొలి సారి తెలంగాణాలో రోడ్ షో నిర్వహించనున్నారు. హైదరాబాద్ లో 27న మోడీ రోడ్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోడీ సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్‌కు బయలుదేరుతారు. ప్రధాని ప్రసంగం 5:00 నుండి 5:45 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 5.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం అనంతరం 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, మాదిగ ఉప కులాల (మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, పరేడ్ గ్రౌండ్స్‌లో నేడు నిర్వహించనున్న మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా చూస్తుంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరుగనున్నది. ఇక, తమను కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సభకు దూరంగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పలువురు దళిత నేతలు భావిస్తున్నారు. అలా కాదని సభలో పాల్గొంటే మాల సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు చెబుతున్నారు.
Viral Video: ఇంటి దగ్గర భార్యాపిల్లలు లేరా.. నడిరోడ్డుపై ఏంటి ఈ సర్కస్ ఫీట్స్