బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీకి బీ-టీమ్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అని ఆయన తెలిపారు. కేసీఆర్ కు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నడనే బీసీ బిడ్డ అయిన బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తప్పించారు అని హనుమంతరావు అన్నారు. అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ ఆయన తెలిపారు. తెలంగాణలో ఘర్ వాపసి తో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుంది అని హనుమంతరావు అన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి.. వాటిని మేము ఇంటర్నల్ గా పరిష్కరించుకుంటాము అని ఆయన పేర్కొన్నారు.
Read Also: Postal Jobs : పోస్టల్ లో జాబ్స్..12,828 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..
కర్ణాటకలో బీసీలు.. మైనారిటీ వర్గాలు కాంగ్రెస్ పక్షాన నిలిచారని.. అందుకే అక్కడ విజయం సాధించడం జరిగిందని వి. హనుమంతరావు తెలిపారు. రానున్న రోజుల్లో బీసీ గర్జన పేరుతో తమ బలం చూపిస్తామని.. తమ డిమాండ్స్ ను కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెడతామని వి. హనుమంతరావు అన్నారు. తాము అగ్రకులాల నాయకులకు వ్యతిరేకం కాదని.. కానీ తమ డిమాండ్.. పాత వారికీ బీసీలకు తగిన స్థానం కల్పించాలని ఆయన కోరారు. కనీసం నలభై శాతం సీట్లు బీసీలకు ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. బీసీలు గతంలో అవమానం భరించారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు.
Read Also: Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
అయితే.. పేరు మార్చుకున్నా.. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. కాళేశ్వరానికి నరేంద్ర మోడీ ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో ప్రస్తుతం రాహుల్ గాంధీ హవా నడుస్తోందని.. ప్రజల్లో రాహుల్ క్రేజ్ బాగా పెరిగిందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ కచ్చితంగా బీజేపీకి బీ టీమ్ అని వీహెచ్ వ్యాఖ్యానించాడు.