బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కౌంటర్ వేశారు. ‘కారు’ గుర్తు ఉన్న పార్టీ (బీఆర్ఎస్) వాళ్ల పరిస్థితిని వాళ్లే చూసుకోవాలని విమర్శించారు. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్డులో పడిందని ఎద్దేవా చేశారు. కనీసం సెకండ్ హ్యాండ్లో కూడా కారును కొనడానికి ఎవరూ లేరని బండి విమర్శలు చేశారు. ఈ మేరకు బండి సంజయ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.
Also Read: IPL 2026 Auction: ఆర్సీబీ నుంచి ఏడుగురు ప్లేయర్స్ ఔట్.. లిస్టులో లివింగ్‌స్టోన్, ఎంగిడి, మయాంక్!
‘బుద్ధి సరిగ్గా లేని వారే.. తామర పువ్వు దేవుడి పూజకు పనికి రాదు అని మాట్లాడుతారు. బ్రహ్మ దేవుడు తామర పువ్వు పైనే కూర్చుంటాడు. విష్ణుమూర్తి చేతిలో తామర పువ్వు ఉంటుంది. లక్ష్మీ దేవి, సరస్వతీ దేవి కూడా తామర పువ్వు పైనే కూర్చుంటారు. నీరు పెరిగే కొద్దీ తామర పైకి లేస్తుంది అంటే.. చుట్టూ ఎంత సమస్య ఉన్నా, ఆ నీటిని తాకకుండా తామర పువ్వు ఎప్పుడూ పైనే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోండి కేటీఆర్. గోల చేసే నాస్తికులు (దేవుడిని నమ్మనివాళ్లు) మమ్మల్ని పడగొట్టాలని చూస్తున్నారు కానీ వారే ఓడిపోతారు అని గుర్తుంచుకోవాలి. మేము నిలబడిన గుర్తు (తామర పువ్వు) లాగే.. బీజేపీ కూడా ఎవరికీ అందకుండా, మరింత గొప్పగా ఎదుగుతుంది. ‘కారు’ గుర్తు ఉన్న పార్టీ వాళ్ల పరిస్థితిని వాళ్లే చూసుకోవాలి. వాళ్ల కారు ఇప్పటికే రిపేర్ చేయడానికి కూడా పనికి రాకుండా షెడ్డులో పడింది. కనీసం సెకండ్ హ్యాండ్లో కూడా దాన్ని కొనడానికి ఎవరూ లేరు’ అని బండి సంజయ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.