Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లోనూ 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి టీ20లో భారత్ 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత, రెండో మ్యాచ్‌లో సూర్యవంశీకి అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ, కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. తుది జట్టులో ప్రిన్స్ యాదవ్, సూర్యాన్ష్ షెడ్గేలకు మాత్రమే చోటు దక్కింది.
సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మంజ్రేకర్ స్పందిస్తూ, ఇది సరైన క్రికెటింగ్ నిర్ణయం కాదని విమర్శించారు. సూర్యవంశీని జట్టులోకి ఎలా సరిపెట్టవచ్చో ఆయన ఒక మార్గాన్ని సూచించారు. “మొదటి మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ పూర్తిగా కుప్పకూలింది. ఓపెనర్లు మాత్రమే రాణిస్తే సరిపోదు, మిడిలార్డర్లో నిలకడైన బ్యాటర్ అవసరం ఉంది. సూర్యవంశీని జట్టులోకి తీసుకుని అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ పంపించి, సీనియర్ బ్యాటర్ సంజు శాంసన్‌ను మిడిలార్డర్లో ఆడించి ఉంటే బాగుండేది. నేను ఈ నిర్ణయంతో ఏమాత్రం సంతోషంగా లేను. సూర్యవంశీ ఇన్నింగ్స్ ఓపెన్ చేయాలని నేను కోరుకున్నాను” అని మంజ్రేకర్ స్పష్టం చేశారు.
Also Read
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
మొదటి టీ20లో భారత జట్టు 182 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. సంజు శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (3) ఘోరంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించినప్పటికీ ఇతర బ్యాటర్ల నుండి సహకారం లభించలేదు. ఐర్లాండ్ డెబ్యూ బౌలర్లు జై ముంద్రా, మాట్ హాలార్డ్లు భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. ఏ ఫార్మాట్లోనైనా భారత్‌పై ఐర్లాండ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌ను బలోపేతం చేయాల్సింది పోయి, సూర్యవంశీని మళ్లీ బెంచ్‌కే పరిమితం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. రెండో మ్యాచ్ లో కూడా ఓపెనర్లు డకౌట్ గా వెనుదిరిగారు.. ప్రస్తుతం టీమిండియా మూడు వికెట్లు పోయి.. కష్టాల్లో ఉంది.
తాజావార్తలు
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
-
Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!