Bandi Sanjay : ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారు..
- నేను అశోక్ నగర్‌కి వెళ్తాను... నిరుద్యోగుల తరపున పోరాడుతా
- సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం స్పందించాలి
- షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు... ఇదేం పద్ధతి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు ఆడుతోంది… 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30 వేల జాబ్స్ ఇచ్చామంటున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు… అమలు చేయడం లేదని, గత ప్రభుత్వనికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదన్నారు. నోటిఫికేషన్ల విషయంలో కేసీఆర్ ఆలోచనా విధానం కాంగ్రెస్ అమలు చేస్తూ… కోర్ట్ కేసులు, నోటిఫికేషన్ లోపాలు చేస్తున్నారని, నిరుద్యోగులకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నాడన్నారు. సిగ్గుందాలి.. కేటీఆర్ పదేళ్ళలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని ఇప్పుడు పోరాటం అంటున్నారని, పేపర్ లీకేజీలకు, కోర్ట్ కేసులకు విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు.
Viral: బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టెలో దాచి పెట్టిన యువతి.. చివరికి ఏమైందంటే..?
Also Read
అంతేకాకుండా..’నేను అశోక్ నగర్ కి వెళ్తాను… నిరుద్యోగుల తరపున పోరాడుతా… సమస్యను జటిలం చేయకుండా ప్రభుత్వం స్పందించాలి.. విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేస్తే ప్రభుత్వాలు తారుమారు అయ్యాయి… అశోక్ నగర్ లో మొదలైన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించక ముందే ప్రభుత్వం దిగిరావాలి కేంద్ర మంత్రిగా కాకుండా.సామాన్య కార్యకర్తగా వెళ్తాను. గతంలో కేసీఆర్ కాళేశ్వరం అని పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టి లక్షకోట్లు ముంచాడు. ఇప్పుడు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ మాతో మోసానికి తెరలేపారు. ప్రభుత్వం హైడ్రా పై పునరాలోచన చేయాలి… 12 వేల కుటుంబాలను ముంచి పొట్టగొట్టి మూసి సుందరికరణ దేనికి…? మూసి సుందరికరణ కోసం ప్రపంచ బ్యాంకు ముందు కాంగ్రెస్ సర్కారు సాగిలపడింది.. పేదలు అన్ని పర్మిషన్లు తీసుకుని కట్టిన ఇళ్లను ఎలా కూలగొడతారు… అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోండి.. హైడ్రా అంటే ప్రజలకు భూతంలా కనిపిస్తుంది… హైడ్రా అంటే నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. హైడ్రా, గ్రూప్ వన్ అంశాలను ఆసరా చేసుకుని రేవంత్ ని దించేందుకు కొందరు మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలును పక్కదారి పట్టించేందుకు ఈ వివాదాలు రేపుతున్నారు…’ అని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
ట్రెండింగ్
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!