గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు…
కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ బోగస్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. 59 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, రైతులకు దగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు దగా, మోసం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా…