ప్రస్తుతం వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, చాలా మంది ఇప్పటికీ దుకాణానికి వెళ్లి వస్తువులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కిరాణా నుంచి బట్టలు, ఇతర వస్తువులను బయటే కొనేందుకు కొంత మంది విముఖత చూపుతారు. అయితే.. షాపింగ్ అనంతరం బిల్లింగ్ కోసం లైన్‌లో నిలబడటం చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది. చాలా సార్లు బిల్లింగ్ కోసం క్యూలో నిలబడి చాలా సమయం వేస్ట్ అవుతుంటుంది. దీనికి ముఖేష్ అంబానీ కంపెనీ
ఓ పరిష్కారం తెచ్చింది.
READ MORE: 5G Network- Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ 5జీ నెట్‌వర్క్ ఇదే..
ఈ లైన్ నుంచి స్వేచ్ఛను అందించడానికి, ముఖేష్ అంబానీ స్మార్ట్ షాపింగ్ కార్ట్‌ను తీసుకొచ్చింది. ముఖేష్ అంబానీ కంపెనీ జియో ఈ కార్ట్‌ను ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో విడుదల చేసింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఉపయోగించారు. ఇందులో కెమెరాలు కూడా అమర్చారు. వాటి సహాయంతో, కస్టమర్ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేదు. బిల్లింగ్ కోసం కౌంటర్‌కి వెళ్లాల్సిన పనిలేదు.
READ MORE:Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..
ఈ బండి ఎలా పని చేస్తుంది?
వినియోగదారుడు ఈ తోపుడు బండ్లలో వస్తువులను ఉంచేటప్పుడు దానికే అమర్చిన కెమెరా ముందు వస్తువులపై బార్ కోడ్‌ను చూపాలి. అంటే దానిని స్కాన్ చేయాల్సి ఉంటుంది. కౌంటర్ దగ్గర నిలబడిన వ్యక్తి ఏదో స్కాన్ చేస్తున్నట్లే.. స్కాన్ చేసిన తర్వాత ఆ ఉత్పత్తి ఆన్‌లైన్ కార్ట్‌కి జోడించబడుతుంది. తర్వాత ఆ బండిలో వేసుకోవచ్చు. మీకు ఏ వస్తువులు కావాలో వాటిని స్కాన్ చేసి బండిలో వేసుకోవాలి. ఏదైనా వస్తువును తొలగించాల్సి వస్తే దానిని కూడా అదే విధంగా మళ్లీ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న ఏఐ కార్ట్‌లో ఏ వస్తువులు ఉన్నావి.. లేనివి కనుగొనగలుగుతాయి. షాపింగ్ పూర్తయిన తర్వాత పూర్తి బిల్లు ఈ కార్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మీరు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయచ్చు. దీంతో టైమ్ చాలా ఆదా అవుతుంది.
READ MORE:5G Network- Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ 5జీ నెట్‌వర్క్ ఇదే..
ప్రస్తుతం ఈ నగరాల్లో ఉపయోగం..
ఇలాంటి తోపుడు బండిని ప్రస్తుతం పరిమిత నగరాల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారు. రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం హైదరాబాద్, ముంబైలోని పలు స్టోర్లలో దీనిని ఉపయోగిస్తున్నారు. త్వరలో దేశంలోని ఇతర స్టోర్లకు కూడా తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.