కేసీఆర్ ఏపీ వారిని పిలిపించుకొని జాయిన్ చేసుకున్నారు అట.. వంద ఎలుకలు తిన్న పిల్లి లెక్క నంగనాచి లెక్క మాట్లాడారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. అయితే.. తాజాగా ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు జాతీయ అధ్యక్షుడు లేడు.. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించ లేదని ఆయన అన్నారు. వచ్చిన వాళ్లకు సిగ్గు ఉండాలి.. గత ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిల్చాడు… ఆంధ్ర వాళ్ళను తిట్టాడు.. ఆంధ్ర బిర్యాని పెండ బిర్యాని అంటివి కదా ఆంధ్ర బిర్యానీ నీ, ఉలవ చారు ను తీసుకుపోయి తినిపియండి కేసీఆర్‌కు అంటూ ఆయన విమర్శించారు. 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఇస్తున్నవా అని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచినవు.. డిస్కంలో నష్టాల్లో ఉన్నాయన్నారు. నీటిని వాడుకునే తెలివి నీకు ఎక్కడ ఉందని, తెలంగాణ ప్రాజెక్ట్ ల ను ఏమి చేశావని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయన్న బండి సంజయ్.. పాఠశాల విద్యలో తెలంగాణ చివరి గ్రేడ్ ఉందన్నారు.
Also Read : Ola Scooters: అమ్మకాల్లో కొత్త రికార్డులు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో తెలంగాణ ఉందని.. మద్యం ఆదాయం 10 వేల కోట్ల నుండి 44 వేల కోట్ల పెరిగిందన్నారు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కేసీఆర్ ఇంకా 2014 లోనే ఉన్నాడు.. అయన అయన మైండ్ అప్డేట్ కాలేదంటూ ఆయన విమర్శించారు. ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాము… వంద దేశాలకు వాక్సిన్ సరఫరా చేశామని ఆయన అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ లు పెద్ద కుట్ర అన్న బండి సంజయ్.. కేసీఆర్ డీఎన్‌ఏలో తేడా ఉందన్నారు. భారత్ దేశంలో భారత బజార్లు ఎందుకు ఉంటాయి… చైనా, అమెరికాలో భారత్ బజార్లు ఉంటాయని, తెలంగాణలో తెలంగాణ బజార్లు ఉన్నాయా, మైసూర్ పాక్ మైసూర్ లో తయారు అవుతుందా అని ఆయన ప్రశ్నించారు. సిటింగ్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు అట…. నువ్వు చేసిన పని ఏంది… నువ్వు తోప్ నాథ్ షిండే వా అంటూ ఆయన ఎద్దేవా చేశారు.