సీఎం కేసీఆర్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి మొయినాబాద్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై వీడియోలు విడుదల చేశారు. అంతేకాకుండా.. బీజేపీ అగ్రనేతలతో పాటు అవలంభిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మ్ హౌస్ ఫైల్స్ కాదు నేను ఇంతే నా కథ ఇంతే అని పెట్టాలి అని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ నిన్న కొత్తగా చెప్పింది ఏమి లేదని, కేసీఆర్ డిప్రెషన్ లో ఉన్నారు… అయన ఎందుకు భయపడడానికి కారణం బిడ్డ లిక్కర్ కేసు… కేసీఆర్ ను ఎవరు నమ్మడం లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. సీఎం ఢిల్లీ నుండి రాగానే సీఎస్, డీజీపీ, స్టీఫెన్ రవీంద్ర లతో సమావేశం అయ్యారు. స్క్రిప్ట్ అంతా రెడీ చేశారు..
Also Read : YSRCP Leaders: పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నారు
26న ఫార్మ్ హౌస్ ల జరిగింది అంతా డ్రామా… సినిమా నడిచింది. 27 న పంచనామాపై పంచ్ ల సంతకం తీసుకున్నారు… ఇదంతా సీఎం నేతృత్వం లో జరిగింది.. ఎమ్మెల్యే లను ఎందుకు విచారించాలేదు. వాళ్ళని నకిలీ గాంగ్ అని నువ్వే అనబడితువి…. వాళ్లే నకిలీ ఆధార్ కార్డ్ తయారు చేసుకున్నారు అని సీఎం ఏ చెబుతున్నారు… ఎమ్మెల్యే లకు రక్షణ కల్పించాలి.. కుటుంబ సభ్యులు జాగ్రత్త పడాలి.. సీఎం తన కూతురి కోసం ఏమైనా చేస్తాడు.. సంతలో పశువు ల లెక్క 37 మందిని కొన్నావు.. తుషార్ అనే వ్యక్తి బీజేపీ సభ్యులు కాదు..’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.