Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Fires On Brs 3

Bandi Sanjay : ఏ రైతును చూసినా కన్నీళ్లు వస్తున్నయ్

Published Date :April 24, 2023 , 5:46 pm
By Gogikar Sai Krishna
Bandi Sanjay :  ఏ రైతును చూసినా కన్నీళ్లు వస్తున్నయ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లోని ఫకీర్ పేట, చామనపల్లి, వేదురుగట్ట గ్రామాల్లో పర్యటించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానతో రైతులు పూర్తిగా పంట నష్టపోయారన్నారు. ఇయాళ పంట పొలాలకు పోయి రైతును కదిలిస్తే దు:ఖమస్తోందని, ఏ రైతును చూసినా కన్నీళ్లే వస్తున్నయన్నారు. అంతేకాకుండా… ‘పోయినసారి పంట నష్టపోయారు. ఈసారైనా పంట చేతికొస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుని అప్పు తీర్చాలని రైతులు తపన పడ్డారు. తీరా చూస్తే మళ్లీ వడగండ్ల వానతో పంట పూర్తిగా నష్టపోయారు. నిర్ణీత సమాయానికి కొనుగోలు కేంద్రాలు తీర్చినట్లయితే ఇంత భారీ నష్టం జరిగేది కాదు.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంవల్ల రైతులు కోతలు పూర్తి చేయలేకపోయారు. గతనెలలోనే సీఎం కేసీఆర్ ఇదే జిల్లాలోని రామడుగు వచ్చిండు. నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తానన్నడు. ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే గత నెలలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇఛ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 288 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తీరా చూస్తే 8 వేల ఎకరాలకే పంట నష్టం ఇవ్వాలని నివేదిక రెడీ చేశారట.. అయినా ఏ ఒక్కరి ఖాతాలో పైసా కూడా పడలేదు.

Also Read : EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు

కేసీఆర్ ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాల్లేవు. ఇయాళ రైతులు బిచ్చమెత్తుకోవాల్నా? నీ మూర్ఖత్వ పాలనలో 4 ఏళ్లలో 70 వేల మంది రైతులు చనిపోయారు. మళ్లీ ఈసారి కూడా రైతులు వడగండ్ల వానకు నష్టపోయారు. ఈసారి 24 వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఈ జిల్లాలోనే… ఇట్లయితే రైతులు కోలుకునేదెలా? అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వనట్లుంది కేసీఆర్ పాలన. ప్రకృతి వైపరీత్యాల కోసం కేంద్రం రాష్ట్రానికి రూ. 3 వేల కోట్ల రూపాయలిచ్చింది. ఆ డబ్బులేం చేసినవో వివరాలు విడుదల చేసే దమ్ముందా? పంజాబ్ పోయి రైతులకు చెక్కులిస్తివి..అవి కూడా చెల్లకపాయే… నీ కొడుకు, బిడ్డ దందాలకిచ్చే చెక్కులు చెల్లుతాయి. మీరు దోచుకున్న సొమ్ములో ఒక్క శాతం ఇస్తే రైతులకు పూర్తి సాయం అందుతుంది.. రుణమాఫీ చేయలేదు. రుణాలివ్వడం లేదు. కౌలు రైతుల గోస చూస్తే దు:ఖమొస్తుంది. అప్పులు చేసి కౌలు చేస్తే పంట నష్టపోయారు. అటు అప్పు కట్టలేక.. ఇంట్ల తినడానికి తిండిలేక ఏడుస్తున్నరు. ఫ్రీ యూరియా ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. రుణమాఫీ చేస్తానన్నడు. రైతును రాజును చేస్తానన్నడు. భూకంపం స్రుష్టిస్తానన్నడు. అవన్నీ గాలికిపోయినయ్. కేసీఆర్ మాత్రం సర్వేలు, నివేదికల పేరుతో, మంత్రుల, ఎమ్మెల్యేల పర్యటనల పేరుతో కాలయాపన చేయడం తప్ప గత 8 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమిటి? మాట్లాడితే కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ఏడుస్తున్నరు. నువ్వు సాయం చేస్తున్న నిధులన్నీ కేంద్రం కేటాయించినవే… మరి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం తరుపున చేసిన సాయం ఏమిటి?

Also Read : EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు

వరికి కేంద్రం మద్దతు ధర ఇస్తుంది. నీ ముఖానికి ఏనాడైనా రూ.500 బోనస్ ప్రకటించినవా? లేదు… వడ్లు కొనుగోలు కేంద్రాలు సమయానికి తెరిచే తెలివి లేదు. పంట చేతికి వచ్చినప్పటి నుండి బ్యాంకులో డబ్బులు పడే దాకా రైతులను అరిగోస పెడుతున్నరు. పోయిన నెల వడగండ్లతో నష్టపోయిన రైతులకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో సీఎం సమాధానం చెప్పాలి. అట్లాగే ఈసారి కూడా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.20 వేలు తక్షణమే ఇవ్వాలి. బీజేపీని ఓడించడానికి కర్నాటక, బెంగాల్ పోయి వేల కోట్ల రూపాయలు కేసీఆర్ ఇస్తున్నడు. ఇతర పార్టీ నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవడానికి ప్రత్యేక విమానాలు పంపుతున్నడు. రైతులకు సాయం చేయడానికి నీకున్న ఇబ్బందేమిటి? నువ్వేమీ తట్టమోసి సంపాదించిన పైసలు కావు కదా… మందిని ముంచడానికి, బీజేపీని ఓడించడానికి వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైన నువ్వు రైతు కంట కన్నీరు తుడిచేందుకు ఎందుకు డబ్బులివ్వడం లేదు? నిత్యం రాజకీయాలేనా? రైతుల వద్దకు వచ్చి చూడు.. ఆ బాధేందో తెలుస్తది. ఇకనైనా సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా పంట నష్టపరిహారం ఇవ్వాలి. రైతులెవరూ నిరాశపడొద్దు. మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ మీకు అండగా ఉంటది. తక్షణమే పరిహారం ప్రకటించకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.

సీఎం నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలి. కానీ నువ్వు మాత్రం ఎన్ని హామీలిచ్చినా ఒక్కటీ అమలు చేయని దుర్మార్గుడివి. నీ జీవితం మొత్తం మోదీని తిట్టడానికే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాల్లేవు. రైతులను ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు… వడ్ల కొనుగోలు కేంద్రాలు తొందరగా తెరిచి ఉంటే రైతులకు మేలు జరిగేది కదా? అది చేయకుండా కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సిగ్గు చేటు. కేంద్రం సహా ఎవరు సాయం చేయాలని భావించినా అధికారుల నుండి ప్రతిపాదనలు రావాలి. కానీ ఆ ప్రతిపాదనలు పంపకుండా కేంద్ర సాయం కోరడం సరికాదు. కేంద్ర బృదం పర్యటించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతా.’ అని బండి సంజయ్‌ అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp
  • breaking news
  • BRS
  • cm kcr

తాజావార్తలు

  • Tirupati Girl De*ath Case Twist: రీల్స్‌ చేస్తూ బాలిక మృతిచెందిన కేసులో సంచలన ట్విస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..

  • Tamil Nadu: అంతా ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఫ్రిజ్‌లు, ల్యాప్‌టాప్‌లు, పంపు సెట్లు.. తమిళనాడు ప్రజలపై వరాల జల్లు..

  • Fakhar Zaman: బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన.. పాకిస్థాన్ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌పై నిషేధం

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • Crime: భార్యను చంపి పరారీ.. LPG సిలిండర్ బుకింగ్‌లో పట్టుబడ్డ నిందితుడు..

ట్రెండింగ్‌

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions