Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malayalam Director Balraj Kalarickal: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. యువ దర్శకుడు బాలరాజ్ కలరికల్ (Balraj Kalarickal) 28 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహించిన కప్పి స్క్వాడ్ (Kappi Squad) వెబ్ సిరీస్ ఇటీవలే జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన మరణవార్త వెలువడటంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన మణిమాల ఆయన స్వస్థలం. దర్శకుడిగా ఎదుగుతున్న సమయంలో బాలరాజ్ మరణించడం మలయాళ సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అందిన సమాచారం ప్రకారం, బాలరాజ్ ఎర్నాకుళంలోని ఓ హోటల్ గదిలో మృతిచెందినట్లు గుర్తించారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్లు ప్రాథమిక సమాచారంలో వెల్లడైంది. హోటల్ గది తలుపు తట్టినా బాలరాజ్ స్పందించకపోవడంతో సిబ్బంది అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డోర్ ఓపెన్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం పరీక్షలు పూర్తయిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
- Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
బాలరాజ్ కలరికల్ స్వతంత్ర దర్శకుడిగా కప్పి స్క్వాడ్ వెబ్ సిరీస్‌తో పరిచయమయ్యారు. ఈ సిరీస్ అక్టోబర్ 15 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్లు విడుదలయ్యాయి. మొత్తం 36 ఎపిసోడ్ల సిరీస్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. తన తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొద్దికాలానికే బాలరాజ్ మృతిచెందడంతో అభిమానులను, సినీ పరిశ్రమకు చెందిన వారిని కలచివేసింది.
దర్శకుడిగా మారకముందు బాలరాజ్ మలయాళ చిత్ర పరిశ్రమలో అసోసియేట్ డైరెక్టర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. నిళల్ (Nizhal), మధురం (Madhuram), డాగిని (Dagini) వంటి చిత్రాలకు ఆయన పనిచేసినట్లు సమాచారం. సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న బాలరాజ్.. తొలి వెబ్ సిరీస్‌తోనే దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన అకాల మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా నిలిచింది.
తాజావార్తలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!