EasyJet Flight: అత్యవసర ల్యాండింగ్ చేయించారు.. అడ్డంగా బుక్ అయ్యారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Arrest Disruptive Passengers Who Force easyJet Flight To Make Emergency Landing: ఈమధ్య విమానాల్లో విచిత్రమైన ఘటనలు చోటు చేసుకోవడం తరచూ వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఇద్దరు ప్యాసింజర్లు ఒక విమానంలో నానారాద్ధాంతం సృష్టించి, ఆ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించి, చివరికి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. విమానం గాల్లో ఉన్నప్పుడు.. అసురక్షితంగా భావించడం వల్లే వాళ్లు ఈ రచ్చకు పాల్పడినట్టు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఏప్రిల్ 19వ తేదీన బుధవారం ఈజీజెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన EZY3409 ఫ్లైట్.. లివర్‌పూల్ నుంచి టర్కీలోని దలమాన్‌కు బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్ అయిన గంట వరకూ.. పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. కానీ.. గంట గడిచిన తర్వాత అసలు రచ్చ మొదలైంది.
Ex-Boyfriend Acid Attack: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వరుడిపై యువతి యాసిడ్ దాడి
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఆ విమానంలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు.. ఆ ప్రయాణం అసురక్షితమని భావించి, గోల చేయడం మొదలుపెట్టారు. ఈ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలంటూ హంగామా సృష్టించారు. విమానంలో ఉన్న సిబ్బంది వారిని ఎంత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా.. వాళ్లు వినిపించుకోకుండా తమ గోల తమదే అన్నట్టు రచ్చ రచ్చ చేశారు. క్యాబిన్ సిబ్బంది సైతం జోక్యం చేసుకోవాలని ప్రయత్నించింది. కానీ.. పరిస్థితులు మరీ చెయ్యి దాటిపోవడంతో, పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. మ్యూనిచ్‌లో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి ముందు.. విమానంలో గోల చేసిన ఆ ఇద్దరు ప్రయాణికుల గురించి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. ఆ ఫ్లైట్ ల్యాండ్ అయిన మరుక్షణమే పోలీసులు లోపలికి వెళ్లి, ఆన్‌బోర్డ్‌లో విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన ఆ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Portofino: అందమైన ప్రదేశం.. కానీ సెల్ఫీలు నిషేధం.. అతిక్రమిస్తే..
కేవలం ఆ ఇద్దరినే కాదు.. ఈ ఘటనతో సంబంధం కలిగి ఉన్న మరో 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. వీరిని అందుబాటులో ఉన్న మరో విమానంలో ఎక్కించి, యూకేకి తరలించారు. అయితే.. ఎవరైతే విమానంలో రచ్చ చేసి, ప్రయాణానికి అంతరాయం కలిగించారో, ఆ ఇద్దరి ప్రయాణికుల వివరాల్ని ఇంకా బయటపెట్టలేదు. ప్రయాణికుల భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా వెంటనే సముచితంగా వ్యవహరించేలా తమ క్యాబిన్ సిబ్బంది శిక్షణ పొందారంటూ.. ఈజీనెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?