దేశం గురించి పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన అధికారం లోకి వస్తుందన్నారు. 11 వేల కార్నర్ మీటింగ్ ల వల్ల పార్టీ సంస్థాగతంగా బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నారు బండి సంజయ్. ఒక్క సంవత్సరంలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ బీజేపీ అని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ను ఎదిరించే పార్టీ బీజేపీ అని నమ్ముతున్నారన్నారు. జాతీయ జెండాకు, జాతీయ గీతంకు ప్రాధాన్యం ఇవ్వని పార్టీలు దేశంలో ఉన్నాయన్నారు. కేసీఆర్‌కి పిచ్చి లేచి దేశమంతా తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రకు కృష్ణ నీళ్ళు ఇచ్చాడు… తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు.
Also Read : AP Special Status: ఏపీకి అన్యాయం చేశారు.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన వైసీపీ
అంతేకాకుండా.. ‘ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, నలుగురు కలెక్టర్‌లు ధరణి పేరుతో కేసీఆర్ కుటుంబానికి దోచి పెట్టారు. నలుగురు కలెక్టర్ ల పై ఆధారాలు బయట పెడతాం.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు బూత్ కమిటీ లు లేవు, బీఆర్‌ఎష్ పార్టీ సెంటిమెంట్ తో అధికారం లోకి వచ్చింది, కేటీఆర్ నీ అయ్య దొంగ దందా చేస్తున్నారు. కాంగ్రెస్ గాలిలొ గెల్చింది.’ అంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. అయితే.. శక్తి కేంద్రాల కార్నర్ మీటింగ్ ల తర్వాత నియోజక వర్గాల వారీగా బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ తరవాత ఉమ్మడి జిల్లాల వారీగా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు బండి సంజయ్.
Also Read : Double Decker Bus : మళ్లీ హైదరాబాద్ రోడ్డు ఎక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు