బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు.