బలూచిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ మీర్ యార్ బలూచ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. 1998లో బలూచిస్థాన్ లో పాకిస్థాన్ నిర్వహించిన అణు పరీక్షలను జాతి నిర్మూలనకు నాందిగా అభివర్ణించారు.
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగట్టనుంది. ఉగ్రవాదాన్ని మన దేశంపైకి ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే పహల్గాం ఘాతుకాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్య యుద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రపంచ దేశాలకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు వెళ్లనున్నాయి.. మోడీ సర్కార్ ఏడు డెలిగేషన్స్‌ను ఏర్పాటు చేసింది. అమెరికా వెళ్లే ప్రతినిధి బృందానికి శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు.
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆన్‌లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతకు సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదించారు. రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని, యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని అందులో పేర్కొన్నారు. అణ్వాయుధాలు ఉన్న భారతదేశం, పాకిస్థాన్ ఎప్పటికీ యుద్ధం చేయలేవన్నారు. ఉగ్రవాదం, పౌరుల హత్యలను వ్యతిరేకించారు. ఇస్లామిక్ బోధనలు, అంతర్జాతీయ సూత్రాలు, మానవ విలువలలో…
గతేడాది కేంద్రంచే నిషేధించబడిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI) 2047 నాటికి భారత్‌లో ఇస్లాం పాలనను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందని మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ క్లెయిమ్ చేసింది.