Balakrishna: అభిమానులు చూసినంత లోతుగా స్టార్ హీరోస్ ను వారి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ చూడలేరన్నది నూటికి నూరు పైసల నిజం! రాబోయే సంక్రాంతి పండుగ నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకం అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఆ మాటకొస్తే ఇదే బాలయ్యకు తొలి సంక్రాంతి అనీ చెబుతున్నారు. వింటూ ఉంటేనే వింతగా ఉంది కదూ! ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణ అనేక పర్యాయాలు తన చిత్రాలను పొంగల్ బరిలో నిలిపి విజేతగా నిలిచారు. మరి అలాంటి బాలకృష్ణకు ఇది తొలి సంక్రాంతి కావడం ఏమిటి అన్న ఆశ్చర్యం కలుగకమానదు. నిజమే ఆయన అభిమానుల కోణంలో నుండి చూస్తే అవునని మనమూ అంగీకరించవలసిందే!
Allu Arjun: పుష్ప రాజ్ ను బిగి కౌగిలిలో బంధించిన ఈ అందగత్తె ఎవరో తెలుసా..?
ఇంతకూ బాలయ్య ఫ్యాన్స్ చెబుతున్నట్టుగా ‘వీరసింహారెడ్డి’ ఆయనకు తొలి పొంగల్ మూవీ ఎలా అవుతుందో చూద్దాం. బాలకృష్ణ నటజీవితం 1974లో ‘తాతమ్మ కల’ చిత్రం ద్వారా ఆరంభమయింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకు సంవత్సరం సంఖ్యలో చివరగా ‘3’ అంకె ఉన్న యేడాదిలో బాలయ్య చిత్రమేదీ సంక్రాంతి పోటీలో పాలు పంచుకోలేదట! అదీ అసలు విషయం. ఇక బాలయ్య కెరీర్ మొదలైనప్పటి నుంచీ ఇప్పటి దాకా అలా సంవత్సరం చివరలో ‘3’ వచ్చిన సంవత్సరాలు – 1983, 1993, 2003, 2013 – వీటిలో బాలయ్య సినిమాలేవీ పొంగల్ బరిలో దూకలేదు. మొట్టమొదటిసారి 2023లో బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ ఆ ఘనతను సాధిస్తోంది. 2023 జనవరి 12న విడుదలవుతోన్న ‘వీరసింహారెడ్డి’ మరో ‘సమరసింహారెడ్డి’లాగో, లేకపోతే ఇంకో ‘నరసింహనాయుడు’ మాదిరిగానో విజయభేరీ మోగిస్తుందని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి లెక్క ప్రకారం 3 అంకె చివర గల సంవత్సరంలో సంక్రాంతికి విడుదలవుతోన్న బాలయ్య తొలి చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఏ తీరున అలరిస్తుందో చూడాలి.