Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. గతేడాది పుష్పతో వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ.. వచ్చే ఏడాది పుష్ప 2 తో మరోసారి టాలీవుడ్ ను పాన్ ఇండియా లెవల్లో నివలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక పెళ్లి తరువాత బన్నీ లైఫ్ మొత్తం మారిపోయింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణం బన్నీ భార్య అల్లు స్నేహారెడ్డి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు ముత్యాలాంటి బిడ్డలు. పెళ్ళికి ముందు అల్లు అర్జున్ పార్టీలు అంటూ తిరిగినా పెళ్లి తరువాత కనీసం హీరోయిన్లతో ముద్దు కూడా వద్దు అని చెప్పేశాడు. అంతలా అతడిని మార్చేసింది స్నేహ. ఆమె అందం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. హీరోయిన్లకు ధీటుగా ఉండే అందం ఆమె సొంతం. ఈ జంట ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఒక సినిమా చేయండి అని అడిగేవారే.
ఇక నిత్యం స్నేహ సోషల్ మీడియాలో తన ఫొటోలతో పాటు భర్తతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బన్నీతో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. బన్నీని తన బిగి కౌగిలిలో బంధించి సెల్ఫీ తీసుకుంది స్నేహ. ఇక అల్లు అర్జున్ బ్యాక్ లుక్ చూస్తుంటే పుష్ప రాజ్ లుక్ లా అనిపిస్తోంది. గుబురు జుట్టు, మాసిపోయిన షర్ట్.. పుష్ప షూటింగ్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన భర్తను కౌగిలించుకొని స్నేహ సెల్ఫీ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు సూపర్ పెయిర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.