నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా దసరా కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.. బాలయ్య ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దుమ్ములేపుతున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు… ఇప్పుడు మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు..
టాలివుడ్ యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈ మూవీ అఫీషియల్ లాంచ్ జరిగి నాలుగైదు నెలలు దాటింది. బాలయ్య ప్రధాన పాత్రలో బాబీ కొల్లి ఓ వాయిలెంట్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రస్తుతం క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది.. అంతేకాదు మరో ఇద్దరు హీరోయిన్ లు కూడా నటిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తుంది..
బాలయ్య ఇప్పటివరకు ఇద్దరు హీరోయిన్లతో నటించారు.. ఈసారి మాత్రం ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య వెండితెరపై అలరించబోతున్నారని తెలుస్తోంది. డిఫరెంట్ గా ప్రజెంట్ చేసేందుకు బాబీ కృషి చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది మొదటి అర్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ఇప్పటివరకు ఒక్కో లుక్ తో తన సినిమాలను సక్సెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాబీ తెరకెక్కించే చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్నారట.. ఆ సినిమాలో ఎలాంటి లుక్ లో కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..