కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు.
ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు.
శివశేన ఎంపీ సంజయ్ రౌత్ కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇంట్లో ఉదయం 7గంటలనుండి సోదాలు నిర్వహించారు. పత్రాచాల్ భూముల కుంభకోణంలో సంజయ్ రౌత్ అవినీతికి పాల్పడ్దారనే అభియోగాలు ఉండటంపై ఆయన ఇంటిలో అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. సంజయ్ రౌత్ నివాసం వద్ద CRPF సిబ్బంది భారీ బందోబస్తు మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో జులై 20వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు విచారణకు…