ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు.