MP K.Laxman : కేంద్ర సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్. బుధవారం కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. కేంద్ర నిధులు సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు ప్రధాని అని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 11, 12 తేదీల్లో విశాఖపట్నం, తెలంగాణలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించబోతున్నారని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని, మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు కేసీఆర్ నిలబెట్టుకోవడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలకు బోధపడుతుంటే ప్రధాని పర్యటన అడ్డుకుంటామని కేసీఆర్ అంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఆశలను కేసీఆర్ అడ్డుకుంటున్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేస్తున్నారు.. మునుగోడు ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చుపెట్టి గెలిచామని టిఆర్ఎస్ అనిపించుకుంటుంది. తెలంగాణలో కుటుంబ ,అవినీతి పనులను ఎదుర్కొనే సామర్థ్యం బిజెపికి ఉన్నది.. అందుకే మునుగోడులో 40 శాతం ఓట్లు బీజేపీకే వేశారు.
Also Read : biryani Fighting: బిర్యానీ విషయంలో గొడవ.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కాంగ్రెస్ పూర్తిగా తూడ్చిపెట్టుకుపోయింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6000 కోట్ల పైచిలుకు నిధులతో పునరుద్ధరించారు. , దాన్ని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని వస్తుంటే అడ్డుకుంటామని అంటున్నారు. లెఫ్ట్ పార్టీలో నేతలు కేసీఆర్ కనుసనల్లో ఉన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఎరువుల కర్మాగారం ఓపెన్ చేస్తుంటే కేసీఆర్ కి వచ్చిన కడుపు మంట ఏంటి. దేశంలోనే రైతులు ఆత్మహత్య చేసుకునే రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగువ స్థానంలో ఉంది. రైతులు సబ్సిడీ ఇవ్వాలని కోరుతుంటే తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తున్న. ఫసల్ బీమా తెలంగాణలో అమలు కావడం లేదు. తెలంగాణను విత్తన భాండాగారంగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు ఏమైంది. కాలేశ్వరం అబసు పాల్ అయింది 30 వేల కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లకు పెంచారు. రైతుల నడ్డి విడిచే ప్రయత్నం కేసీఆర్ చేశారు.
మిషన్ భగీరథ ఫేర్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది. మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయగా మారింది. ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వకుండా అనేక మంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దాని కారణం ప్రభుత్వం. ఇంటికా ఉద్యోగం అని చెప్పిన టిఆర్ఎస్ ఇప్పుడు ఊరికే ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితి. మునుగోడులో కమ్యూనిస్టుల సహకారం కేసీఆర్ పొందారు. కమ్యూనిస్టులకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కేసీఆర్ దొరికారు.
ప్రజలు వీటన్నిటిని అర్థం చేసుకుంటున్నారు. ప్రధానమంత్రి పర్యటనను అడ్డుకుంటామని టిఆర్ఎస్ అంటున్నారు. మూడేళ్ల నుంచి తెలంగాణలో నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండానే సింగరేణి ప్రైవేట్ కరణం అవుతుందా. సింగరేణిని లాభాల బాటలు నడిపిస్తుంటే వారికి న్యాయపరమైన డిమాండ్ నెరవేర్చకుండా బోనస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుణంగా మార్చేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారు. హింసను పేరేపించే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. వీటిలో కమ్యూనిస్టులు చలి కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.’ అని లక్ష్మన్ అన్నారు.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!