పానీపూరి.. ఆహా చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది కదూ.. ఇక తినాలని అనిపిస్తుంది కదూ.. అవును ఆ రుచి ముందు మిగతా రుచులు వేరయా.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు.. టేస్ట్ బాగుంది కదా అని అతిగా తింటే ఇక ప్రాణాలకే ముప్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో కల్తీగాళ్ళు ఎక్కువ అవుతున్నారు.. పది రూపాయల పెట్టి తినే దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు..
ఇలా చాలా సార్లు పానీపూరీ విషయంలో కూడా ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. పానీపూరీని తయారు చేసే వారు నకిలీ మసాలాలను వాడుతున్నారని బయట పడింది.. ఇదిలా ఉండగా.. ఇప్పుడు పానీపూరి గురించి మరో భయంకరమైన నిజం బయటకు వచ్చింది.. పానీపూరీ నీళ్లల్లో యాసిడ్ కలిపి అమ్ముతున్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. నీటిలో యాసిడ్ కలపడం వల్ల పానీపూరీ రుచి పెరుగుతుందని, ఇక తమ దగ్గరే తింటారని భావిస్తున్నారని అధికారులు చెబుతున్నారు..
పానీపూరి నీళ్లల్లో యాసిడ్ వేశారని గుర్తించి జాగ్రత్త పడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. నీటి రంగు చాలా తేలికగా మారితే వారు నీటిలో యాసిడ్ కలపారని అర్థం.. స్టీల్ బౌల్ లో ఇస్తే దాని అంచుల చుట్టూ మచ్చలు ఏర్పడుతాయి.. ఇక గొంతులో మంట, చికాకుగా ఉండటం, అలాగే కడుపులో మంట ఉంటుంది.. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వడం మంచిది.. తోటివారిని అప్రమత్తం చెయ్యడం చెయ్యాలి.. సురక్షితమైన ప్రాంతాల్లో మాత్రమే తినడం మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.