సహజంగా కొంతమంది పసిపిల్లలకు ఒక సంవత్సరం అవ్వగానే ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు రెండు సంవత్సరాలు నిండినాకానీ మాట్లాడలేరు. మాటలు రావట్లేదని చాలా కంగారు పడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు. పసిపిల్లలు నెలలు నిండే కొద్దీ వారు ఎలా మాట్లాడతారో, అమ్మ తాత, అత్త అని ఎప్పుడు పిలుస్తారో అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో పాకడం, నడవటం లాంటివి వయసును బట్టి ఎలా నేర్చుకుంటారో, మాట్లాడడం కూడా అలాగే వయసును బట్టి అలవడాలి. ఈ నేపథ్యంలో మొదటి రెండు సంవత్సరాల్లోనే పిల్లలకు మాటలు వస్తాయి. కానీ కొందరు పిల్లల్లో ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. దీంతో వాళ్ళ తల్లిదండ్రులు గాబరాపడిపోతుంటారు. ఈ క్రమంలో పిల్లలకు వాళ్ళ వయసును బట్టి సరైన సమయానికి మాటలు రావాలంటే తల్లిదండ్రులు ఏవిధమైన ప్రోత్సాహం అందించాలో తెలుసుకుందా.
Also Read : Beauty Tips: ముఖంపై మచ్చలు ఇబ్బంది పెడుతున్నాయా ?
ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి.. మీరు గమనించే ఉంటారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లి వారి ముందు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏ విషయాన్నైనా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి వారితో ఎక్కువగా మాట్లాడటం, ఏ విషయాన్నైనా వారితో చెప్పటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇదంతా వారికి త్వరగా మాటలు రావడానికి చేసే ప్రయత్నమే. పిల్లల్ని ఆడించడానికి తల్లులు ఎక్కువగా ఉపయోగించేవి. ఆటవస్తువులు. ఈ క్రమంలో వివిధ ఆట వస్తువుల గురించి వివరిస్తూ పిల్లల్ని ఆడించడానికి ప్రయత్నించాలి. దీని వల్ల పిల్లలు ఆట వస్తువులకంటే తల్లి చెప్పే దాని మీదే ఎక్కువ శ్రద్ధ పెడతారు. కాబట్టి ఇలా ఆడుకునే ప్రతి వస్తువు పేరు, దాని గురించి చెప్పటం లాంటివి చేస్తే, వాళ్ళలో వినికిడి శక్తి పెరగడంతో పాటు గ్రహించేశక్తి కూడా పెరిగి మాటలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : Motion sickness Tips : జర్నీల్లో వచ్చే వాంతులను తగ్గించే చిట్కాలు
తర్వాత కథలు చెప్పాలి. చాలా మంది పిల్లలు కథలు వింటూ నిద్ర పోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతారు. దీనివల్ల పిల్లల్లో గ్రహించేశక్తి తో పాటు ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. ఇలా ప్రతి రోజు చాలా మాటలు వినడం వల్ల ఇందులో నుంచి కొన్ని మాటలైన వాళ్ళ మనసులో నాటుకు పోతాయి. దీంతో నెమ్మదిగా వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది. పిల్లలకు మాటలు రావాలంటే తల్లితండ్రులే టీచర్లుగా మారాలి. ఉదాహరణకు మీరు పిల్లల్ని ఆడిస్తూ టీవీ చూస్తున్నారు అనుకుంటే అందులో ఏమైనా జంతువులు లాంటివి కనిపిస్తే వాటి పేర్లు చెప్పటం లాంటివి చేయాలి. అలాగే ఏదైనా బొమ్మల పుస్తకం, ఇంగ్లిష్ లేదా తెలుగు అక్షరమాల పుస్తకాన్ని చూపిస్తూ వాటి పేర్లు చెప్పటం.. ఇలా కూడా చేయవచ్చు. దీనితో పాటు మీ కుటుంబ సభ్యులంతా ఒక చోట ఈమె మీ అమ్మ, మీ నాన్న, మీ అత్త ఇలా బాంధవ్యాల గురించి చెప్పటం, ఇలాంటివి తరచూ చేస్తూ ఉంటే పిల్లలకు మీరు ఎదురు చూడకముందే మాటలు వచ్చే అవకాశం ఉంటుంది.
Also Read : Tips For Sinusitis : సైనస్ ని తగ్గించే ఇంటి చిట్కాలు
అలా కాకుండా మీరు ఏం చెప్పకముందే మాటలు రావాలంటే మాత్రం కష్టమే. సాధారణంగా చిన్న పిల్లలు మనం చెప్పిన పదాలను తప్పులు లేకుండా పలకరు. వాళ్ళు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి స్పష్టంగా పలకలేరు. అందువల్ల వాళ్ళు పదాలను స్పష్టంగా పలకాలి అంటే తల్లిదండ్రులే వాళ్ళ తప్పుల్ని సరిదిద్దాలి. అలా కాదమ్మా ఇలా పలకాలి అని నెమ్మదిగా నేర్పించే ప్రయత్నం చేయాలి. దీనితో క్రమక్రమంగా వారిలో స్పష్టంగా మాట్లాడే ధోరణి కూడా అలవడుతుంది. పిల్లలకు ఇష్టమైన పదార్థాలు, వాళ్లకు ఇష్టమైన ఆట వస్తువులు మొదలైనవి వాటిని వాళ్ళు చేసేటప్పుడు వాళ్లకు అందకుండా ఉంచడం లాంటివి చేయడం వల్ల వాటిని తినాలని అందుకోవాలనే ఆశతో వారు మాట్లాడడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది.
Also Read : Tips For Asthma In Winter : చలికాలంలో ఆస్తమాతో జాగ్రత్త.. ఈ చిట్కాలు పాటించండి..!
ఎప్పుడు ఇంట్లోనే పిల్లలకు కూడా బోర్. కాబట్టి వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా పిల్లలకు అలవాటు చేయాలి. దీనికోసం వాళ్ళను అప్పుడప్పుడు అలా బయటకు తీసుకు వెళ్తూ ఉండాలి. పార్క్‌లకు స్నేహితుల ఇళ్లకు తీసుకు వెళ్ళాలి. దాంతో అక్కడ పిల్లలు మాట్లాడుతూ ఉంటే మీ పిల్లలు కూడా ఆటోమెటిక్‌గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది పిల్లలకు ఏమి చెప్పిన ఏం చేసినా మాటలు రావట్లేదని ఒక్కోసారి చెయ్యి చేసుకోవడం కూడా చూస్తూ ఉంటాం. కానీ అది మంచిది కాదు. దీని వల్ల వాళ్ళలో ప్రతికూల భావాలు రెట్టింపు అవుతాయి. ఇలా మీరు బాధపడుతూ వాళ్ళని బాధపెట్టడం మంచిది కాదు. కాబట్టి తల్లిదండ్రులు ఓపికతో ఉంటూ పిల్లలకు మాటలు నేర్పడం అనేది ఉత్తమమైన మార్గము. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నించిన తరువాత కూడా మీ పిల్లలకు మాటలు రావట్లేదంటే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళడం చాలా అవసరం.