AP Assembly: నేడు స్పీకర్ ఎన్నికపై సభలో అధికారిక ప్రకటన.. దూరంగా వైసీపీ..!
- ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
- ఈ రోజు శాసన సభలో బాధ్యతల స్వీకరణ
- ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రకటించనున్న ప్రొటెం స్పీకర్
- గౌరవప్రదంగా స్పీకర్‌చైర్‌లో కుర్చొబెట్టనున్న సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కూటమి ఎమ్మెల్యేలు.. స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా వైసీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, ఈ రోజు ఆయన శాసన సభలో బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఇవాళ రెండో రోజు ఉదయం పదిన్నరకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.. నిన్న ప్రమాణం చేయని వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇక, ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటిస్తారు.. ఆ తర్వాత స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు అయ్యన్నపాత్రుడు. సభాపతి ఎన్నిక ప్రకటన తర్వాత.. అయ్యన్నను గౌరవప్రదంగా స్పీకర్‌చైర్‌లో కుర్చొబెట్టనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ఎమ్మెల్యేలు.. అయితే, స్పీకర్ ఎన్నిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.. సభాపతిగా ఎన్నికైన వ్యక్తిని అధికార, విపక్ష నేతలు స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఉదయం వ్యక్తిగత పర్యటన కోసం పులివెందులకు వెళ్లనున్నారు.
Read Also: Govinda Namalu: గోవింద నామాలు
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
మరోవైపు.. స్పీకర్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు తొలి ప్రసంగం చేయనున్నారు.. సీఎం ప్రసంగాన్ని బలపరుస్తూ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు ప్రసంగాలు ఉండనున్నారు.. ఆ తర్వాత ప్రసంగాలకు సమాధానం ఇవ్వనున్నారు కొత్త స్పీకర్. ఇక, స్పీకర్ సమాధానం తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడనుంది.. కాగా, స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం శుక్రవారం రోజు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరగగా.. టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రమే నామినేషన్ వేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు.. గడువులోగా మరో నామినేషన్ దాఖలు కాకపోవడంతో.. అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!