Mahesh Babu: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. వెండితెరపై కనిపించే వారందరూ కేవలం నటిస్తారు మాత్రమే. బయట ఎవరికి ఎవరు బంధువులు కారు.. బంధాలు, అనుబంధాలు ఉండవు. అది వారి వృత్తి మాత్రమే. ఒక సినిమాలో హీరోహీరోయిన్లుగా కనిపించినవారే.. ఇంకో సినిమాలో అన్నాచెల్లెళ్లలా కనిపిస్తారు. అది కేవలం పాత్రలు మాత్రమే. అక్కడ చూడాల్సింది వారి నటనను మాత్రమే. ఒకప్పుడు చాలామంది ఇది తెలియనివారు.. సినిమాలో పెళ్లి చేసుకుంటే.. నిజంగానే వారు పెళ్లి చేసుకుంటారని అపోహ పడేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. జనరేషన్ మారింది. నటీనటుల జీవితాలు రియాలిటీలో వేరు ఉంటాయని అందరికి తెల్సిందే. అంతేకాదు ఈ సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కూడా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఈ రియాలిటీ తెలిసి కూడా కొంతమంది ట్రోల్ చేయడం చాలా దారుణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు అంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. జనవరి 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకోవడంతో సినిమాపై ట్రోలింగ్ జరుగుతుంది. కథ నచ్చలేదని, నటీనటులు బాగా చేయలేదని ట్రోల్ చేయడం వరకు ఓకే.. కానీ, ఈ సినిమాలో ఉన్న రిలేషన్ ను.. వేరే సినిమాలో వారు చేసిన పాత్రలతో పోలుస్తూ ట్రోల్ చేయడం మంచి పద్దతి కాదని మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
గుంటూరు కారం చిత్రంలో మహేష్ కు తల్లిగా రమ్యకృష్ణ నటించిన విషయం తెల్సిందే. అయితే.. వీరిద్దరూ నాని సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ చేశారు. సినిమాలో ఈ సాంగ్ ను డిలీట్ చేసినా యూట్యూబ్ లో ఈ సాంగ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ ను తీసి.. ఒకప్పుడు రొమాంటిక్ సాంగ్ చేసి.. ఇప్పుడు తల్లికొడుకులుగా చేస్తున్నారని, నీచమైన కామెంట్స్ పెట్టి ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్స్ పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఛీఛీ.. సిగ్గుండాలిరా.. ఇలా ట్రోల్ చేయడానికి.. వాళ్లు నటులు. ఎలాంటి పాత్ర అయిన చేయగలరు. అది కేవలం సినిమా వరకే. కేవలం మహేష్ మాత్రమే కాదు… ఎంతోమంది ఇలాంటి పాత్రలు చేశారు. హీరో హీరోయిన్ గా మంచి జంట అనిపించుకున్న ఎన్టీఆర్- సావిత్రి.. ఒక సినిమాలో అన్నాచెల్లెళ్లుగా నటించారు. అడవిరాముడు సినిమాలో ప్రభాస్ తో స్పెషల్ సాంగ్ చేసిన రమ్యకృష్ణ.. బాహుబలిలో అతనికే తల్లిగా చేసింది. ప్రకాష్ రాజ్- జయసుధ ఎన్నో సినిమాల్లో జంటగా కనిపించారు.. సోలో సినిమాలో అక్కాతమ్ముడిలా నటించారు. ఇలా ఎంతోమంది పాత్రలకు తగ్గట్టు మారారు. సినిమాను సినిమాలా చూడడం మానేసి.. ఇలా రిలేషన్ అంటూ ట్రోల్ చేయడం దారుణమని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.