Avatar 2: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్ 2’ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలలోనూ అద్భుతమైన ఓపెనింగ్స్‌ను రాబట్టిన ఈ సినిమా స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించింది. వీకెండ్ లో ‘అవతార్2’ టికెట్ సాధించటం అంటే గర్వంగా ఫీలవుతున్నారు ప్రేక్షకులు. ఇక ఇంత క్రేజ్ ఉన్న ఈ సినిమాకు ఏపీలో 70 చోట్ల సినిమా విడుదల కాలేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ సినిమా హక్కుల కోసం బడా నిర్మాతలు ప్రయత్నించినప్పటికీ సినిమాను విడుదల చేసిన డిస్నీ సంస్థ వారికి బిపి తెప్పించే రేట్లు చెప్పటంతో అందరూ వెనకడుగు వేశారు. దాంతో అన్ని చోట్లా నేరుగా థియేటర్లవారితో మాట్లాడి విడుదల చేసింది డిస్నీ.
Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాషాయ బికినీ ఫోటో వైరల్..
ఈ నేపథ్యంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో దాదాపు 70 చోట్ల సినిమా ప్రదర్శనకు నోచుకోలేదు. ఇది కేవలం డిస్నీవారి అనుభవరాహిత్యం అని చెప్పవచ్చు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాను తొలిరోజు సక్రమంగా థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చేసుకోవడంలో డిస్నీ సంస్థ విఫలం అయింది. దీని వల్ల ఎంతో రెవిన్యూ లాస్ అవుతుందంటున్నారు. ఇక 3డిలో విడుదలైన చోట్ల థియేటర్లు కిటకిటలాడుతుంటే 2డిలో విడుదలైన చోట అంత స్పందన లేకపోవడం గమనార్హం. సినిమా చూసిన ఆడియన్స్ లో కూడా మిశ్రమ స్పందన ఉంది. కొంతమంది అద్భుతం అంటుంటే మరి కొంత మంది బాగా లాగ్ ఉంది… ఓ అరగంట నిడివి తగ్గి ఉంటే బాగుండేది అంటున్నారు. తొలి రోజే కాబట్టి సినిమాకు సంబంధించి అసలైన రిపోర్ట్ రావాలంటే సోమవారం వరకూ ఆగాల్సిందే. లెట్స్ వెయిట్ అండ్ సీ…