ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు.. ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీస్ స్టిక్కర్లు తమ వాహనాలకు వేసుకొని మరి స్మగ్లింగ్ చేస్తుండగా కల్లూరు రైల్వే బ్రిడ్జి సమీపంలో అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు.. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు తిరుపతి రుయా ఆసుపత్రిలో సమీపంలో ఉండే ఆంబులెన్స్ డ్రైవర్లుగా గుర్తించారు..
అటవీ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కట్టడిపై ఫోకస్ పెట్టాలని పవన్ ఆదేశించారు. ఇతర దేశాలకు అక్రమంగా ఎర్రచందనం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు.
లగేజీ ముసుగులో అక్రమంగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్న ముఠా ఆట కట్టించారు ఏపీ పోలీసులు. తిరుపతి జిల్లాలో రెండు కోట్లు విలువ చేసే దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సినీఫక్కీలో 21 కిలోమీటర్లు చేజింగ్ చేసి 44 మంది కూలీలను అరెస్ట్ చేశారు. భారీ స్థాయిలో ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు 75 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు కల్వకుర్తి, కడప వాసులుగా గుర్తించారు.
ఏకంగా ఎయిర్పోర్ట్లోనూ భారీగా ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి.. చెన్నై పోర్టులో ఎర్ర చందనం దుంగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఓ భారీ కంటైనర్ లో రూ.5 కోట్ల విలువ చేసే ఎర్ర చందనం గుర్తించారు కస్టమ్స్ అధికారులు… చెన్నై నుండి సముద్ర మార్గం ద్వారా తైవాన్ వెళుతున్న ఓ భారీ కంటైనర్ లో ఎర్ర చందనం ఎగుమతి అవుతుందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు.. రాళ్ల ముసుగులో ఎర్ర చందనం ఎగుమతి చేస్తున్న…