Maheswari became judge of Extra Jabardasth instead of kushboo: తెలుగు బుల్లితెరపై ఎక్కువగా పాపులర్ అయిన షో ఏదైనా ఉందా అంటే టక్కున జబర్దస్త్ అని చెప్పేస్తారు. అంతలా ఈ షో కనెక్ట్ అయింది. ఒకప్పుడు రోజా, నాగబాబు ఉన్నప్పుడు ఈ షో దెబ్బకు అన్ని టీవీ ఛానల్స్ రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఇక నాగబాబు, రోజా వెళ్లి పోయాక.. షోలో అశ్లీల కామెడీ ఎక్కువ అయ్యాక రోజు రోజుకు ఈ షో ఆదరణ తగ్గిపోతుంది. ఇక అనసూయ ఈ షోకు యాంకర్ గా గుడ్ బై చెప్పడం, సుధీర్, ముక్కు అవినాష్ వంటి కమెడియన్స్ కూడా ఈ షో నుంచి నిష్క్రమించడం మైనస్ గా మారిందనే చెప్పాలి. ఇక మొన్నటి వరకు సౌమ్య రావు యాంకర్ గా ఉండేది. ఆమె ప్లేస్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ ను తీసుకువచ్చి షాక్ ఇచ్చారు. ఆ షాక్ మరువక ముందే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు మరో షాక్ ఇచ్చారు నిర్వాహకులు. ఇక ఈ షోలో నాగబాబు, రోజా తర్వాత జడ్జ్ లుగా చాలా మంది మారారు.
Sai Pallavi: హీరోల కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్న ఫిదా బ్యూటీ.. ?
ఇటీవల కాలంలో భగవాన్, ఖుష్భు జడ్జ్ లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు.. ఖుష్భు ప్లేస్ లోకి ఇప్పుడు మహేశ్వరి వచ్చింది. ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరి గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. పెళ్లి, గులాబి వంటి సినిమాలో తెలుగు ప్రేక్షకులను అలరించింది ఇప్పుడు జబర్దస్త్ షోలో సందడి చేస్తుంది. అయితే ఈమె ఎంట్రీతో ఖుష్భు మార్క్ కామెడీ మిస్ అయిందని.. ఏదో లోటు ఉందని నెటిజన్స్ అంటున్నారు. మరి ఒక్క ఎపిసోడ్ కు పరిమితం అవుతారా.. మొత్తం కొనసాగుతారా అనేది తెలియాల్సి ఉంది. ఇక బుల్లితెర ప్రేక్షకులకు ఈ మార్పులు ఎక్కడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు నాగబాబు, రోజా ఉన్నప్పుడే కామెడీ బాగుందని అంటున్నారు.