తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైంది.
యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కొసం ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలాలపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఆమె చర్యలు పార్టీ కేడర్‌లో అసంతృప్తికి కారణం అవుతున్నాయట. చాలాకాలంగా ఎమ్మెల్యే సునీతా ఆమె భర్త నల్లగొండ DCCB ఛైర్మన్ మహేందర్ రెడ్డిలు మండలాల వారీగా సీనియర్లను కాదని మరికొందరిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారపార్టీలో మొదటి నుంచి ఉన్న…